దూరవిద్య ద్వారా చదువాలనుకునే వారు హైదరాబాద్‌లోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ, పీజీ డిప్లమా, సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల అయింది. 2022-23 సంవత్సరానికి ప్రవేశాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపింది.
అండర్ గ్రాడ్యుయేట్, పీజీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు కావాల్సిన అర్హత, దరఖాస్తు వివరాలు, ముఖ్యమైన తేదీలను నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు, పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లోమాలో బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ వంటి పలు సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలోనే స్వీకరిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ జూన్ 30 నుంచి ప్రారంభమవ్వగా.. జూలై 31తో ముగియనుంది. పూర్తి వివరాలకు https://www.braouonline.in వెబ్‌సైట్ సందర్శించవచ్చు.
Advertisement
Advertisement
ఇక వీటితో పాటు అంతకు ముందు విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందిన వారు సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజును, అంతకు ముందు చేరిన విద్యార్థుల్లో సకాలంలో చెల్లించకపోయినా వారు కూడా జులై 31వ తేదీలోపు ట్యూషన్ ఫీజు ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలని వెల్లడించారు. అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (డిగ్రీ)కి 10+2 ఇంటర్మీడియట్ ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి. బీఏ, బీకాం, బీఎస్సీ తెలుగు, ఇంగ్లీషు మీడియం, బీఏ, బీఎస్సీ ఉర్దూ మీడియంలో ఉన్నాయి. పీజీ కోర్సులు ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొన్నది. ఇక ఈ కోర్సులు కూడా తెలుగు, ఇంగ్లీషులో మీడియంలలో ఉన్నాయి. పూర్తి వివరాలకు అంబేద్కర్ యూనివర్సిటి హెల్ప్‌లైన్ నెంబర్లు 7382929570, 7382929580, 7382929590, 7382929600 కు కాల్ చేయవచ్చని సూచించారు.
Also Read :
నాగచైతన్య గురించి సాయి పల్లవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు.. వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!