Home » అంబానీ కారు డ్రైవర్ జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

అంబానీ కారు డ్రైవర్ జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తులలో రెండో వ్యక్తి, ప్రపంచంలో సంపన్న వ్యక్తులలో పదవ స్థానంలో కొనసాగుతున్న వ్యక్తి ముఖేష్ అంబానీ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశంలోనే విలువైన కంపెనీలో రిలయన్స్ సంస్థ ముందంజలో ఉంటుంది. అయితే ముకేశ్ అంబానీ ఇంట్లో పనిచేసే పనిమనుషుల జీతాలు, జీవితాలు కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయట. ముంబైలోని 27 అంతస్తుల ఇంట్లో 600 మంది పని చేస్తారట. ఇంతటి విలాసవంతమైనఇంట్లో పనిచేసే వారి జీతాలు కూడా ఏ రేంజ్ లో ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంబానీ ఇంట్లో పనిచేసే వారికి జీతం ఎంత ఇస్తారో తెలిస్తే మీరందరూ ముక్కున వేలేసుకుంటారు. ముఖ్యంగా అంబానీ కార్ డ్రైవర్ కి జీతం

ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ దేశాల్లోనే చాలా ఖరీదైన హోమ్ ప్రాపర్టీస్ లో ముఖేష్ అంబానీ గారి ఇల్లు అగ్రస్థానంలో ఉంది. దీనిని దక్షిణ ముంబైలో నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టారు. ఈ ఇల్లు ధర దాదాపు పదకొండు వేల కోట్లు ఉంటుంది. 27 అంతస్తుల భవనంలో 600 మంది పని వాళ్ళు ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ముఖేష్ అంబానీ కారు నడిపే పర్సనల్ డ్రైవర్ జీతం నెలకు సుమారు రెండు లక్షల రూపాయలట. వీటితోపాటు ఇతర ఎలివెన్స్ అదనంగా ఇస్తారు. ఆయన కార్ డ్రైవర్ కి ఒక కార్పొరేట్ జనరల్ మేనేజర్ కి ఇచ్చే జీతంతో సమానంగా ఇస్తారన్నమాట. ఇక

Advertisement

Advertisement

అంబానీ గారి ఇంట్లో వంటలు చేసే వంట మనుషుల జీతమైతే రెండు లక్షల నుండి 3 లక్షల వరకు ఉంటుందట. ఇక మిగిలిన హోమ్ క్లీనర్లు, బ్యూటీషియన్లు, అసిస్టెంట్లు, టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఇలా ఆరు వందల మందిలో సుమారు 200 నుంచి 300 మంది పనివాళ్ళకు సుమారు లక్ష నుండి రెండు లక్షల వరకు జీతాలు ఇస్తుందట అంబానీ కుటుంబం. ఇంత పెద్ద ఇంట్లో, ఇంత మంది వర్కర్లు పనిచేస్తున్న ఇంట్లో ఉండేది మాత్రం ఐదుగురే.

ALSO READ:

వైరల్ అవుతున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పెళ్లి పత్రిక చూసారా ?

రామ్‌చ‌ర‌ణ్ ఆ స‌మ‌యంలో ఏడ్చేశాడంట‌.. ఎందుకంటే..?

 

Visitors Are Also Reading