Home » అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ఫస్ట్ రివ్యూ.. విజయ్ దేవరకొండ ఏం అన్నారంటే..?

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ఫస్ట్ రివ్యూ.. విజయ్ దేవరకొండ ఏం అన్నారంటే..?

by Sravya
Ad

నటుడు సుహాస్ గతంలో పలు సినిమాలతో అందరిని మెప్పించారు ఇప్పుడు హీరోగా మరో సినిమాతో రెడీ అయ్యాడు సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో రాబోతున్నాడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుంది అని ఇప్పటికే ఆడియన్స్ అనుకుంటున్నారు. ఫిబ్రవరి 2న థియేటర్లలో గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది హైదరాబాదులో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా బిగ్ టిక్కెట్ ని హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ ఈ సినిమా చాలా బాగుందని ప్రశంసించారు. ఇది ఒక స్పెషల్ మూవీ అని తప్పకుండా హిట్ అవుతుందని అన్నారు విజయ్ దేవరకొండ. అలానే ఆయన మాట్లాడుతూ ఈ సినిమా బిగ్ టికెట్ లాంచ్ చేయడం సంతోషంగా ఉందని చెప్పారు.

Advertisement

Advertisement

ఇటువంటి మంచి సినిమా ప్రమోషన్ లో బాగామవ్వడం హ్యాపీగా ఉందని అన్నారు టీజర్ దగ్గర నుండి మూవీ ని ఇంట్రెస్ట్ గా క్రియేట్ చేశారు దర్శకుడు అని అన్నారు. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి స్పెషల్ మూవీ రాబోతోందని చెప్పారు నేను సినిమాని చూశాను ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. మ్యూజిక్ ఆర్టిస్టులు పర్ఫామెన్స్లు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని విజయ్ దేవరకొండ అన్నారు. అలానే ఎప్పటిలాగే సుహాస్ బాగా నటించారని చెప్పారు శరణ్య కూడా అద్భుతంగా నటించిందని అన్నారు. ఏ సినిమా కైనా ఫస్ట్ హాఫ్ చూసాక కొంచెం విరమం తీసుకుని నేను ఈ సినిమాకి కంటిన్యూస్గా ఫుల్ సినిమా ని చూశానని అన్నారు విజయ్ దేవరకొండ.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading