Telugu News » Blog » మెగాస్టార్ చిత్రంలో ఆమె హీరోయిన్ గా ఛాన్స్ మిస్ చేసుకుందా..! అసలు ఏం జరిగింది?

మెగాస్టార్ చిత్రంలో ఆమె హీరోయిన్ గా ఛాన్స్ మిస్ చేసుకుందా..! అసలు ఏం జరిగింది?

by Anji
Published: Last Updated on
Ads

టాలీవుడ్ లో ఒకప్పుడు శుభలగ్నం, ఆడది, కన్నయ్య కిట్టయ్య, మిస్టర్ పెళ్లాం, ఘరానా బుల్లోడు, వంశోద్ధారకుడు, మావిచిగురు వంటి ఫ్యామిలీ ఓరియెంటేడ్ సినిమాలలో హీరోయిన్ గా నటించి సినీ ప్రేక్షకులను మెప్పించిన ఆమని గురించి దాదాపు అందరికీ తెలిసిందే. 

Advertisement

ఈమె స్వతహాగా కన్నడ నటి అయినప్పటికీ తెలుగులోనే మంచి గుర్తింపు లభించింది. నటి ఆమని ఈ మధ్య ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 

Also Read :   37 ఏళ్ల తర్వాత డిగ్రీ తీసుకున్న RGV

Advertisement

 

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి రిక్షావోడు చిత్రం దాదాపు అందరికీ గుర్తుండే ఉంటుంది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీ క్రాంతి చిత్ర బ్యానర్ పై క్రాంతి కుమార్ నిర్మించారు. చిరంజీవి బ్యాడ్ సమయంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అదే సమయంలో విడుదలైన ఆర్.నారాయణమూర్తి ఒరేయ్ రిక్షా మూవీ సూపర్ హిట్ అయింది. దీంతో చిరు అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. ఒరేయ్ రిక్షా చిత్రానికి దర్శకుడు దాసరి నారాయణరావు. ఇదిలా ఉంటే.. రిక్షావోడు చిత్రం పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. సినిమా ప్లాప్ కావడానికి ముఖ్య కారణం ఫ్లాష్ బ్యాక్ ని సరిగ్గా డిజైన్ చేయకపోవడమే అనే కామెంట్స్ వినిపించాయి. 

Also Read :  Rangamarthanda Teaser : బ్రహ్మానందం విశ్వరూపం.. శ్రద్ధగా చెక్కిన కృష్ణవంశీ!

Manam News

రిక్షావోడులో హీరోయిన్లుగా సౌందర్య, నగ్మా నటించారు. సౌందర్యని సెకండ్ హీరోయిన్ తీసుకోవడం కూడా చాలా మందికి నచ్చలేదు. ఇదిలా ఉంటే.. రిక్షావోడు చిత్రంలో తొలుత ఆమని, సౌందర్య ఎంపికయ్యారట. తొలుత ఈ సినిమాకు బి.గోపాల్ దర్శకుడిగా ఎంపికయ్యారు. అనుకోకుండా ఈ చిత్రానికి దర్శకుడు మారడంతో తనను ఈ చిత్రం నుంచి తీసేశారని తెలిపింది. చిరంజీవి తనకు ఇష్టమైన హీరో అని.. సౌందర్య తన బెస్ట్ ఫ్రెండ్ అని వారిద్దరితో కలిసి నటించే మంచి ఛాన్స్ మిస్ అవ్వడం బాగా తనను బాగా బాధ పెట్టిందని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. మెగాస్టార్ తో నటించాలనే తన కల ఇప్పటికీ కలగానే మిగిలిపోయిందని.. కనీసం ఇక ముందు అయినా తనకు చిరంజీవితో నటించే అవకాశమొస్తుందని ఆశాభావం వ్యక్తిం చేసింది ఆమని. 

Advertisement

Also Read :  కమల్ హాసన్ వల్ల మరో పెళ్లి చేసుకొని తిరిగిరాని లోకానికి వెళ్లిన హీరోయిన్ ఎవరో తెలుసా ?