అక్కినేని అమల.. ఒకప్పుడు సినిమాల్లో కథానాయిక కాగా ఆ తర్వాత బ్లూ క్రాస్ ద్వారా ప్రజలందరికీ చిరపరిచితమయ్యారు. నాగార్జున భార్య అమలకి సోషల్ మీడియాలో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈమె నటించిన సినిమాలలో చాలా సినిమాలు ప్రేక్షకులను ఆశించిన రేంజ్ లో ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే. ఒక సినిమాలు మాత్రమే కాకుండా మూగజీవాలకు సంబంధించి బ్లూ క్రాస్ ఏర్పాటు చేసి సామాజిక కార్యకర్తగా ఆమె కంటూ ఓ సపరేట్ స్ట్రెచర్ ఉంది.
ఇక ఈమె పెళ్లి కాగానే కెమెరాకు దూరంగా జరిగింది. వైవాహిక జీవితం తర్వాత గ్లామర్ రోల్స్ చేయడం నచ్చలేదు కావచ్చు అని అంటారు నెటిజెన్లు. అయితే అమల ఎప్పుడు కనిపించినా చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటుంది. మెడలో బంగారం కూడా ఎక్కువగా కనిపించదు. మరి దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అక్కినేని అమల ఎక్కడికి వచ్చినా సరే చాలా సింపుల్ లుక్స్ లో మెరుస్తోంది.
Advertisement
Advertisement
అది ఆమె స్టైల్ అని చాలామంది భావిస్తారు. కానీ ఆమెకి బంగారం వేసుకుంటే ఎలర్జీ వస్తుందట. చర్మంపై రాషెస్ వచ్చేస్తాయి. స్కిన్ మొత్తం రెడ్డీష్ గా మారిపోతుందట. ఈ ఒక్క కారణంతోనే అమల బంగారానికి దూరమైందని అక్కినేని కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు. కానీ ఆమెకి మాత్రం మొదటినుంచి బంగారం అంటే చాలా ఇష్టమట. ఎక్కువగా చేతికి పెట్టుకునే ఉంగరాలను ఇష్టపడుతుందట. కానీ ఇలాంటి ఓ చిన్న డిసీజ్ వల్ల ఆమె బంగారానికి దూరమయ్యారు.