Home » ఆచార్య సినిమాలో కాజల్ ఉంటుందా.. ఉండదా..? కొరటాల శివ ఏమంటున్నారంటే..!!

ఆచార్య సినిమాలో కాజల్ ఉంటుందా.. ఉండదా..? కొరటాల శివ ఏమంటున్నారంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇప్పటికే ఆచార్య సినిమాపై అభిమానుల్లో ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. వచ్చే నాలుగు రోజుల్లో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కాజల్, మరియు సెకండ్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటించారు. కానీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాజల్ కు అసలు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ మూవీలో కాజల్ అసలు లేదనే టాక్ కూడా బయటకు వచ్చింది. దీంతో కొరటాల శివ ఈ మూవీలో కాజల్ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చేశారు.

Advertisement

ఈ సినిమాలో కాజల్ పాత్ర ధర్మస్థలి లో ఉండి ఎటువంటి సరదా పాత్ర అని, స్టోరీ ప్రకారం ఆచార్య పాత్రకు ప్రేమ లేకుండా హీరోయిన్ ను పెట్టాలని భావించి ఎంపిక చేశామని కొరటాల అన్నారు.  కాజల్ పాత్రను రాసుకున్న టైంలోనే ఆ పాత్ర పై అనుమానం ఉండగా, నాలుగు రోజులు షూటింగ్ అయిన తర్వాత అనుమానం మరింత పెరిగిపోయిందని కొరటాల శివ తెలియజేశారు. ఈ పాత్రకు కంక్లూజన్ కూడా క్లియర్ గా లేకపోవడంతో ఊరికే ఆ పాత్రను పెట్టడం అనేది సరి కాదని చిరంజీవికి కాజల్ కు చెప్పానని కొరటాల చెప్పుకొచ్చారు.

Advertisement

దీని తర్వాత కాజల్ మూవీ నుంచి తప్పుకున్నారని ఇందులో ఆమె లేరని తెలియజేశారు. లహే.. లాహే.. పాటలు మాత్రం హీరోయిన్ కాజల్ కనిపిస్తుందా లేదా అనే ప్రశ్నకు కొరటాల సినిమా చూసి తెలుసుకోవాలి అని వెల్లడించారు. అయితే కొరటాల శివ ఇచ్చిన క్లారిటీ వల్ల కాజల్ అభిమానులు మాత్రం సంతృప్తితో లేరు. ఆచార్య మూవీ మేకర్స్ తమకు భారీ షాక్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. కాజల్ కొరకు ఆచార్య సినిమాను చూడాలనుకునే వారికి నిరాశ తప్పదని తెలుస్తున్నది.

ALSO READ;

“ఒక్కడు” సినిమా కి హీరోగా మొదటి చాయిస్ మహేష్ కాదట ! మరెవరో తెలుసా ?

ఆర్ఆర్ఆర్ కు మించిన స్థాయిలో అప్పట్లో వచ్చిన ఎన్టీఆర్ సినిమా అదేనా ??

 

Visitors Are Also Reading