Home » బాల‌య్య నో చెప్పాడు..అదే క‌థ‌తో మోహ‌న్ బాబు బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు..!

బాల‌య్య నో చెప్పాడు..అదే క‌థ‌తో మోహ‌న్ బాబు బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు..!

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన‌ సినిమాలో మరో హీరో నటించి హిట్ కొట్టడం సహజమే. అలా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు మంచి మంచి కథలను మిస్ చేసుకుంటారు. అయితే అదే కథను మరో హీరో చేసి సూపర్ హిట్ అందుకుంటారు. అలానే ఇక్కడ న‌ట సింహం నందమూరి బాలకృష్ణ కూడా ఒక సినిమాను మిస్ చేసుకోగా అదే కథను మోహన్ బాబు చేసి సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా ఏంటి ఆ సినిమా విశేషాలు ఏంటి ఇప్పుడు చూద్దాం.

also read : అందాల తార అరుణ ఇప్పుడు ఎలా ఉంది..? ఏం చేస్తుంది..!

Advertisement

 

మోహన్ బాబు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావును ఓ సినిమా చేసి పెట్టాలని అడిగారు. అయితే రాఘవేంద్రరావు అప్పటికే చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రాఘవేంద్రరావు మోహన్ బాబుతో అల్లుడుగారు అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Advertisement

మోహన్ బాబు కెరీర్ లోనే భారీ విజయం గా ఈ సినిమా నిలిచింది. అయితే ఈ సినిమా ఆఫ‌ర్ మాత్రం ముందుగా బాల‌కృష్ణ‌కు వ‌చ్చింది. మలయాళంలో మంచి విజయం సాధించిన ఓ సినిమాకు రీమేక్ ఈ చిత్రం వచ్చింది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం సినిమాకు రీమేక్ అల్లుడుగారు సినిమా….మ‌ల‌యాళంలో ఈ సినిమా 300 రోజులు ఆడింది. ఈ సినిమా రీమేక్ హక్కులను సీనియర్ నటి సుహాసిని సొంతం చేసుకున్నారు.

అయితే బాలకృష్ణ హీరోగా రీమేక్ చేయాలని అనుకున్నారు. కానీ బాలయ్య ఈ కథకు నో చెప్పడంతో ఆ తర్వాత రీమేక్ రైట్స్ చేతులు మారి మోహన్ బాబు వ‌ద్ద‌కు చేరాయి. అలా అల్లుడుగారు సినిమాలో మోహ‌న్ బాబు హీరోగా నటించారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించగా సినిమా మంచి విజయం సాధించింది.

Visitors Are Also Reading