Home » బన్నీ మనసు వెన్న.. డ్రైవర్ కు ఎన్ని లక్షల సాయం చేశారంటే..?

బన్నీ మనసు వెన్న.. డ్రైవర్ కు ఎన్ని లక్షల సాయం చేశారంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరిలో అల్లు అర్జున్ స్థానం ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పటికే తన నటన అభినయంతో తెలుగు ఇండస్ట్రీలో కోట్లాదిమంది అభిమానుల సంపాదించుకున్నారు. ఐ కాన్ స్టార్ గా పిలవబడే అల్లు అర్జున్ నటన అంటే చాలామందికి పిచ్చి. ఈమధ్య కాలంలోనే పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన పుష్ప సినిమాతో ఇండియా మొత్తంలో మంచి గుర్తింపు సాధించారు ఐకాన్ స్టార్.. ఎంత పేరు సంపాదించుకున్న ఎన్ని ఉన్నా ఒదిగి ఉండాలి అనే మనస్తత్వం కలిగిన హీరో అల్లు అర్జున్ అని చెప్పవచ్చు.

Advertisement

అంతేకాకుండా సహాయం చేయడంలో కూడా బన్నీది అందజేసిన చెయ్.. ఎవరు సాయం అడిగిన కాదనలేరు. తన దగ్గర పని చేసే సిబ్బందికి ఎల్లవేళలా అండదండలు అందిస్తారట. తాజాగా బన్నీ గురించి ఒక విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ డ్రైవర్ గా బోరబండకు చెందిన మైపాల్ 10 సంవత్సరాలుగా చేస్తున్నారు. మహిపాల్ స్వస్థలం వరంగల్. నమ్మకంగా ఉండడంతో అల్లు అర్జున్ అతన్ని తన వ్యక్తిగత డ్రైవర్ గా కొనసాగిస్తున్నారు. కాగా మహిపాల్ బోరబండలో సొంత ఇల్లు కట్టుకుంటున్నారు.

Advertisement

also read:భార్య మరణించిన తరువాత దిల్ రాజు ఆ టాప్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నారా ?

ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ తన డ్రైవర్ కు 15 లక్షల రూపాయల సాయం అందించారు. మహిపాల్ కుటుంబ సభ్యులను కలిసి అమౌంట్ అందించి వారిని సంతోషంలో ముంచెత్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీంతో చాలామంది అభిమానులు బన్నీ అన్న గొప్పతనం గురించి, బన్నీ మనసు వెన్న అంటూ కామెంట్లు చేస్తున్నారు.

also read:

Visitors Are Also Reading