Home » బ‌న్నీని స్నేహ‌రెడ్డి ఎలా ఇరికించిందో తెలిస్తే షాక్‌..!

బ‌న్నీని స్నేహ‌రెడ్డి ఎలా ఇరికించిందో తెలిస్తే షాక్‌..!

by Bunty

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ సినిమా ప్ర‌స్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. మొత్తానికి అల్లు అర్జున్ ఫ‌ర్పామెన్స్‌కు అంతా ఫిదా అవుతున్నారు. సినిమాకు డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ బ‌న్నీ న‌ట‌న‌కు మాత్రం అంతా ఏక‌తాటిపై ఓటు వేస్తున్నారు. మొత్తానికి బ‌న్ని ఫుష్ప పార్ట్ 01 స‌క్సెస్ ప‌ట్ల ఫుల్ ఖుషీ అవుతున్నాడు. ఇప్పటికే మూవీ మేకర్లు సక్సెస్ సంబురాలు కూడా మొదలుపెట్టేశారు. సుకుమార్‌ను అందెలం ఎక్కిస్తూ.. కాళ్లకు దండం పెట్టేస్తున్నారు. అయితే రియాల్టీ మాత్రం వేరే విధంగా ఉంది.

పుష్ప సినిమా ప‌ట్ల‌, త‌న యాక్టింగ్ ప‌ట్ల వ‌స్తున్న ఫీడ్‌ను చూసీ అల్లుఅర్జున్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఏకంగా త‌న భార్య‌ను తీసుకుని పబ్లిక్‌గా థియేట‌ర్‌కు వ‌చ్చి.. సినిమా చూసాడు. అభిమానుల మ‌ధ్య‌లో కూర్చుని అలా సినిమా చూడ‌డంతో ఫుల్ ఎంజాయ్ చేసిన‌ట్టు ఉన్నాడు. ఇది నాకు ఎంతో ముఖ్య‌మైన‌దంటూ కూడా స్నేహారెడ్డి పోస్ట్ కూడా చేసింది.

 

ఇదిలా ఉండ‌గా.. బ‌న్నీ ధ‌రించిన టీ ష‌ర్ట్ మీద స్నేహారెడ్డి కౌంట‌ర్ వేసింది. రౌడీ బ్రాండ్‌ అంటే బన్నీకి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన‌దే. అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ స్పెషల్‌గా ఓ టీషర్ట్‌ను పంపించాడు. దానిని ధరించి థియేట‌ర్‌లో సినిమాను వీక్షించాడు బ‌న్నీ. బన్నీ ధరించిన టీషర్ట్ మీద ఉన్న అక్షరాలు ఇప్పుడు వైరలయ్యాయి. RDY, AA అంటూ రాసి ఉండగా.. మధ్యలో లవ్ సింబల్స్ కూడా ఉన్నాయి. . వాటిపై స్నేహారెడ్డికి అనుమానం వచ్చి.. రౌడీ లవ్స్ అల్లు అర్జున్ లేదా?.. రెడ్డి లవ్స్ అల్లు అర్జున్ అంటూ అనుమానాన్ని వ్యక్తం చేసింది. మొత్తానికి బన్నీని స్నేహారెడ్డి ఇలా ఇరుకున పెట్టేసింది. దానికి బన్నీ ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి మ‌రి.

 

Visitors Are Also Reading