Telugu News » అల్లు అర్జున్ అన్న బాబి యాక్టింగ్ దూరంగా ఉండ‌టానికి రీజ‌న్ ఏంటో తెలుసా..!

అల్లు అర్జున్ అన్న బాబి యాక్టింగ్ దూరంగా ఉండ‌టానికి రీజ‌న్ ఏంటో తెలుసా..!

by AJAY MADDIBOINA

బాలీవుడ్ అయినా కోలీవుడ్, టాలీవుడ్ లు అయినా వారస‌త్వం క‌చ్చితంగా ఉంటుంది. సినిమా హీరోలే కాకుండా నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు కూడా త‌మ వార‌సులు న‌టులు అవ్వాల‌ని అనుకుంటారు. దానికి కార‌ణం ద‌ర్శ‌కులు నిర్మాత‌ల కంటే న‌టీన‌టులకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఎక్క‌డ‌కు వెళ్లినా ప్ర‌త్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఇక సినిమా వాళ్ల వార‌సులు అంటే అవ‌కాశాలు రావ‌డం చాలా సుల‌భం.

Ads

 

అయితే ఆ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటేనే ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డ‌గులుగుతారు. ఇక మెగాఫ్యామిలీ నుండి చాలా మంది వార‌సులు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా దాదాపు అంద‌రూ స‌క్సెస్ అయ్యారు. కానీ అల్లు అరవింద్ పెద్ద‌కుమారుడు…అల్లు అర్జున్ అన్న బాబీ మాత్రం యాక్టింగ్ కు దూరంగా ఉన్నారు. కానీ బాబీ గీత ఆర్ట్స్ లో ప్రడ‌క్ష‌న్ కు సంబంధించిన ప‌నులు చూసుకుంటారు.

ఇక ఇప్పుడు వ‌రుణ్ తేజ్ హీరోగా తెర‌కెక్కుతున్న గ‌ని సినిమాతో బాబి నిర్మాత‌గా కూడా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో తాను న‌ట‌న వైపు అడుగులు వేయ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను బాబి వెల్ల‌డించారు. త‌నకు యాక్టింగ్ లోకి రావాల‌ని ఎన్నో అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని చెప్పారు. హీరోగానే కాకుండా ముఖ్య‌మైన పాత్ర‌లు చేసినా సంపాద‌న ఎక్కువ‌గా ఉంటుంద‌ని కూడా తెలుస‌ని అన్నారు.

కానీ త‌ను చిన్న‌ప్పుడే యాక్టింగ్ లోకి రాకూడ‌ద‌ని బ‌లంగా డిసైడ్ అయ్యాన‌ని చెప్పారు. సినిమాల్లో న‌టించి స్టార్ స్టేట‌స్ వ‌స్తే ఎక్కడ‌కు వెళ్లినా సెల‌బ్రెటీలు కాబ‌ట్టి ఇబ్బంది పెడ‌తార‌ని అన్నారు. ఎక్క‌డ‌కూ స్వేచ్చ‌గా వెల్ల‌డం కుద‌రని అన్నారు. కానీ తాను కావాల్సిన‌ప్పుడు బ‌య‌ట‌కు వెళ్లి టీ తాగి వ‌స్తాన‌ని చెప్పారు. ఎప్పుడంటే అప్పుడు ఎక్క‌డికి అంటే అక్క‌డికి వెళ్లిపోతాన‌ని చెప్పారు.

Also Read: బాహుబ‌లిలో ఈ విష‌యాన్ని మీరు ఎప్పుడైనా గ‌మ‌నించారా..?


You may also like