Home » “పుష్ప” తో అల్లు అర్జున్ కి పెరిగిన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. !!

“పుష్ప” తో అల్లు అర్జున్ కి పెరిగిన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. !!

Ad

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఎంతో పేరును సంపాదించుకున్నారు అల్లు అర్జున్. సినిమా విడుదలై అన్ని భాషల్లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ తరుణంలో పుష్ప సెకండ్ పార్ట్ కోసం ఆయన అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. జులై నెలలో పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఇంతలో స్క్రీఫ్ట్ లో భారీగా మార్పులు చేస్తున్నారని సుకుమార్ అండ్ టీం తెలియజేస్తోంది. అయితే పుష్ప 2 రెండవ భాగంలో రెండు లేదా మూడు కొత్త పాత్రలను ప్రవేశ పెడుతున్నారని, మొదటి భాగంతోనే వచ్చిన క్రేజ్ వల్ల బన్నీ తన రెమ్యూనరేషన్ ను పెంచేశారు అనే వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమాకు అల్లు అర్జున్ 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నాడని తెలుస్తోంది.

Advertisement

 

Advertisement

అయితే పుష్పా2 కోసం బన్నీ వంద కోట్ల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడు అని టాక్ వినబడుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బన్నీ అడిగిన విధంగా పారితోషికం ఇవ్వడానికి అంగీకారం తెలిపారు అట. బన్నీ తన సినీ జీవితంలో పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడమే కాకుండా అత్యధిక పారితోషికం అందుకోవడం రెండో ఈ సినిమాతోనే జరిగాయని అంటున్నారు. అయితే రెండోభాగం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే తదుపరి చిత్రం కోసం ఆయన ఎంత డిమాండ్ చేస్తారో వేచి చూడాలి.

ALSO READ :
శ్రీ‌హ‌రికి త‌న మ‌ర‌ణం గురించి మూడు నెల‌ల ముందే తెలుసా..?

త్వరలో ఇంటర్ పరీక్షలు.. ఈ నిబంధనలు తప్పనిసరి..!!

 

Visitors Are Also Reading