Telugu News » Blog » ఆ రోజు అల్లు అర్జున్ చెప్పిన ఆ మాటే నిజం అయ్యిందిగా….చొక్కా విప్పి తిరిగి..!

ఆ రోజు అల్లు అర్జున్ చెప్పిన ఆ మాటే నిజం అయ్యిందిగా….చొక్కా విప్పి తిరిగి..!

by AJAY
Published: Last Updated on
Ads

గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండియన్ సినిమాను శాసిస్తోంది. తెలుగులో వచ్చిన సినిమాలు ఇతర భాషల్లోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. దాంతో దేశవ్యాప్తంగా టాలీవుడ్ కు ఓ క్రేజ్ ఏర్పడింది. అయితే మొదట ఈ క్రేజ్ జక్కన్న తీసిన బాహుబలి సినిమా తో వచ్చింది. దాంతో అంతా టాలీవుడ్ లో రాజమౌళి ఒక్కరే గ్రేట్ డైరెక్టర్ అనుకున్నారు. కానీ పుష్ప ది రైజ్ సినిమా చూసిన తర్వాత బాలీవుడ్ జనాలు ఫిదా అయిపోయారు.

సుకుమార్ కూడా గొప్ప దర్శకుడు అని గుర్తించారు. పుష్ప సినిమా తర్వాత ఎక్కడ చూసినా అవే పాటకు అదే సినిమా పేరు వినిపిస్తోంది. ఈ సినిమా పై బాలీవుడ్ తారలు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాపై ముందు నుండి అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దాంతో సుకుమార్ ఆ అంచనాలను రీచ్ అవుతారా లేదా అనే సందేహాలు తలెత్తాయి.

pushpa

మరోవైపు ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఈ సినిమా తర్వాత దర్శకులంతా కొత్త స్టైల్ మేకింగ్ నేర్చుకుంటారని చెప్పారు. ఒకవేళ కొత్త స్టైల్ మేకింగ్ వాళ్ళు నేర్చుకోకపోతే తను చెప్పింది నిజం కాకపోతే మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లో చొక్కా లేకుండా తిరుగుతానని సవాల్ విసిరారు. ఇక అల్లు అర్జున్ చెప్పింది నిజమైందా లేదా అనే విషయానికి వస్తే తాజాగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ సుకుమార్ పై ప్రశంసలు కురిపించారు. అంతే కాకుండా సుకుమార్ ఫోన్ నెంబర్ తీసుకుని ఏకంగా ఆయనకు మెసేజ్ పెట్టారు.

ఆ మెసేజ్ లో సుకుమార్… పుష్ప సినిమా గ్రేట్ ఎంటర్టైనర్ అని మీరు ఇదే విధంగా అద్భుతమైన సినిమాలను చేయాలని కోరారు. సుకుమర్ ను తాను ఒకసారి కలవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఎప్పుడైనా మీరు ముంబైకి వస్తే తప్పకుండా ఫోన్ చేయాలని రాజ్ కుమార్ హిరాని కోరారు. రాజ్ కుమార్ హిరానీ మెసేజ్ కు సుకుమార్ కూడా రిప్లై ఇచ్చారు. కథలు రాయడంలో ఫిల్మ్ మేకింగ్ లో రాజ్ కుమార్ హిరానీ తనకు స్ఫూర్తి అంటూ పేర్కొన్నారు. ఇక ఇలా బాలీవుడ్ దర్శకుడు సుకుమార్ పై ప్రశంసలు కురిపిస్తుంటే అల్లు అర్జున్ ముందే సినిమా రిజల్ట్ ను ఊహించి చెప్పాడా అనిపిస్తోంది.


You may also like