Home » హైద‌రాబాద్ లో అల్లు అర్జున్ కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..? ల‌గ్జ‌రీ ఫామ్ హౌస్ తో పాటూ..!

హైద‌రాబాద్ లో అల్లు అర్జున్ కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..? ల‌గ్జ‌రీ ఫామ్ హౌస్ తో పాటూ..!

by AJAY
Ad

అల్లు రామ‌లింగ‌య్య న‌ట‌వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో అల్లు అర్జున్. తండ్రి స్టార్ ప్రొడ్యూసర్ కావ‌డం మామ చిరంజీవి కూడా స్టార్ కావ‌డంతో బ‌న్నీకి మొద‌ట అవ‌కాశాలు చాలానే వ‌చ్చాయి. అయితే అవకాశాలు వ‌చ్చినంత మాత్రాన స్టార్ అవ్వ‌రు. ఆ అవ‌కాశాలను స‌ద్వినియోగం చేసుకుని అల్లు అర్జున్ ఎంతో క‌ష్ట‌ప‌డి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక రీసెంట్ గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

ALSO READ : Sr:NTR చివరి కోరిక.. ఓ ఇంటర్వ్యూలో హరికృష్ణ బయట పెట్టారుగా..!!

Advertisement

అంతే కాకుండా ప్ర‌స్తుతం అల్లు అర్జున్ కు డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. దాంతో ఆయ‌న రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో అందుకుంటున్నారు. రీసెంట్ గా బ‌న్నీ సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ సినిమాకు వంద కోట్లకు పైగా రెమ్యునరేష‌న్ అందుకుంటున్నాడ‌ని టాక్.

Advertisement

అదే విధంగా వ్యాపార ప్ర‌క‌ట‌న ల ద్వారా కూడా బ‌న్నీ కోట్ల‌ల్లో సంపాదిస్తున్నాడు. ఇక బన్నీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 20ఏళ్లు దాటింది. దాంతో ఈ స్టార్ హీరో భారీగా ఆస్తులు సంపాదించి ల‌గ్జ‌రీ జీవితాన్ని గ‌డుపుతున్నాడు. ఆ వివ‌రాలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 2023 వ‌ర‌కు అల్లు అర్జున్ కు రూ.345 కోట్ల ఆస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఇక అల్లు అర్జున్ త‌న స్టైలిష్ లుక్ కు త‌గిన‌ట్టుగా కార్ ల‌ను కూడా వాడుతున్నారు.

ఆయ‌న వ‌ద్ద రేంజ్ రోవ‌ర్ కారుతో పాటూ జాగ్వార్, బెంజ్ మ‌రియు బీఎండ‌బ్ల్యూ కార్ లు ఉన్నాయి. వీటితో పాటూ హైద‌రాబాద్ లో బ‌న్నీ రియ‌ల్ ఎస్టేట్ లోనూ పెట్టుబ‌డులు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. నార్సింగి లోని అల్లు స్టూడియోస్ లో ఆయ‌న భాగ‌స్వామిగా ఉన్నారు. ఇక ఉండ‌టానికి జూబ్లిహౌస్ లో ల‌గ్జ‌రీ హౌస్ ను క‌లిగి ఉన్నారు. అదేవిధంగా ఓ ఫామ్ హౌస్ ను కూడా అల్లు అర్జున్ క‌లిగి ఉన్నారు.

ALSO READ : రాహుల్ కు ఇందిరా గాంధీకి పట్టిన గతే.. ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు సంచలన ట్వీట్

Visitors Are Also Reading