ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైనా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా బాహుబలి సినిమాతోనే సౌత్ ఇండియా సినిమాలు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నాయని నిరూపితమైంది.
ముఖ్యంగా బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప, కార్తికేయ 2 వంటి సినిమాలు సౌత్ ఇండియాలోనే కాదు.. నార్త్ ఇండియాలో కూడా సంచలన విజయాలను అందుకున్నాయి. కాన్సెప్ట్‌లో పస ఉంటే చాలు.. హీరోతో సంబంధం లేకుండా ఏ హీరో సినిమాలు అయినా ఎక్కడైనా దుమ్మురేపుతుందని ప్రూప్ అయిపోయింది. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లుఅర్జున్, యశ్ లాంటి హీరోలు ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్స్ గా అవతరించారు. ఇక సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమిర్‌ఖాన్, రణబీర్ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కి గట్టి పోటీ ఇచ్చే స్టార్స్ గా ఎదిగారు. దీంతో ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ అనే భేదం లేకుండా పోయింది. హీరోల కన్నా కంటెంటే ముఖ్యం అని ఈ జనరేషన్ ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుతం భారతీయ సినిమా సరికొత్త టర్న్ తీసుకుందనే చెప్పాలి.
ఇది కూడా చదవండి : మమ్ముట్టి ఇంటి నుంచి ఎంత మంది నటులు ఇండస్ట్రీకి వచ్చారో తెలుసా..?
పాన్ ఇండియా రేంజ్లో మ్యూజిక్ చేసిన చిత్రాలతో ఆయా హీరోల పారితోషికాలు ఓ రేంజ్లో పెరిగాయి. ప్రస్తుతం వీరిలో రూ.100 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకునే హీరోలున్నారు. పుష్ప చిత్రంతో నార్త్ లో దాదాపు రూ.330 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టింది. దాదాపు రూ.330 కోట్లకు పైగా వసూళు రాబ్టట్టిన బన్నీ ఈ చిత్రం రెండో భాగం కోసం ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోగా సరికొత్త రికార్డు నెలకొల్పాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలోన రూ.125 కోట్ల పారితోషికం ఒకే సినిమాకి తీసుకుంటున్న హీరో సల్మాన్ ఖాన్ కాగా ఇప్పుడు అదే పారితోషికం అందుకుంటున్న హీరోగా అల్లు అర్జున్ నిలిచిపోవడం విశేషం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సౌత్‌లో రూ.125 కోట్ల పారితోషికం అందుకునే తొలి హీరోగా అల్లుఅర్జున్ చరిత్ర సృష్టించడం ఖాయమని చెప్పాలి.
ఇది కూడా చదవండి : చిరంజీవికి కృష్ణంరాజు ఇచ్చిన అత్యంత ఖరీదైన బహుమతి ఏంటో తెలుసా..?