Home » త్రివిక్రమ్ ను కాదని ఆ డైరెక్టర్ తో సినిమా చేయనున్న బన్నీ..!

త్రివిక్రమ్ ను కాదని ఆ డైరెక్టర్ తో సినిమా చేయనున్న బన్నీ..!

by Azhar
Ad
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు అనే విషయం తెలిసిందే. అయితే గత ఏడాది చివర్లో విడుదల అయిన పుష్ప సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంచనాలు లేకుండానే బాలీవుడ్ లో విడుదల అయ్యి అక్కడ చాలా రికార్డులు బద్దలు కొట్టింది. దాంతో అందరూ ఇప్పుడు అల్లు అర్జున్ తోక పుష్ప 2 కోసం వేచి చూస్తున్నారు.
ఇక ఈ సినిమా దర్శకుడు సుకుమార్ కూడా తొందరగా పుష్ప 2 ను పూర్తి చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడు అనే చర్చ చాలా రోజులుగా సాగుతుంది. ఈ చర్చలో చాలా మంది అల్లు అర్జున్ తర్వాతి సినిమా త్రివిక్రమ్ తో ఉంటుంది అని కామెంట్స్ చేసారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో కాకుండా మరో డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడు అని తెలుస్తుంది.
ఈ పుష్ప 2 సినిమా ముగిసిన తర్వాత అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో సినిమా చేయనున్నాడు అని తెలుస్తుంది. దళపతి విజయ్ కి ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చిన అట్లీ ఇప్పుడు షారుక్ ఖాన్ తో పాన్ ఇండియా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో అట్లీ.. అన్ని ఎమోషన్స్ ఉండే ఓ సినిమా చేయనున్నాడు అని తెలుస్తుంది.

Advertisement

Visitors Are Also Reading