Home » ఇంద్రభవనంలా అల్లు అర్జున్ కొత్త ఇల్లు …ప్రత్యేకతలు ఇవే ..!

ఇంద్రభవనంలా అల్లు అర్జున్ కొత్త ఇల్లు …ప్రత్యేకతలు ఇవే ..!

by AJAY
Ad

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైలే వేరు. అందువల్లే ఆయనకు స్టైలిష్ స్టార్ అనే బిరుదు వచ్చింది. అల్లు అర్జున్ వేసుకునే బట్టలు ఆయన షూటింగ్ కి వెళ్లే క్యారెవ్యాన్ ప్రతి ఒక్కటి డిఫరెంట్ గా ఉండాలని కోరుకుంటారు. అలాంటి అల్లు అర్జున్ హైదరాబాద్ లో తన స్టైల్ కు తగ్గట్టుగా ఇంటిని నిర్మించుకున్నారు.

Advertisement

ఈ ఇల్లు దాదాపు ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. చూడడానికి భారీ భవనంలా కాకుండా చాలా సింపుల్ స్వీట్ గా అల్లు అర్జున్ ఇల్లు ఉండటం విశేషం.

ఇక ఇంట్లో అల్లు అర్జున్ ఆయన సతీమణి స్నేహ రెడ్డి మరియు ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఇక ఈ ఇంటి విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…. అల్లు అర్జున్ నివహిస్తున్న ఈ ప్రత్యేకమైన ఇంటిని ప్రముఖ ఆర్కిటెక్ అమీర్ శర్మ డిజైన్ చేశారు. ఇంటి చుట్టూ ప్రహరీ గోడ లోపల చుట్టూ పచ్చగడ్డి ఇంటి ముందు భాగంలో స్విమ్మింగ్ పూల్ ను ఏర్పాటు చేశారు. ఇంట్లోకి ప్రవేశించిన మార్గంలోనే ఈ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది.

Advertisement

స్విమ్మింగ్ పూల్ నుండి సులభంగా డైనింగ్ హాల్ కు వెళ్లే విధంగా గదులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అయాన్, అర్హా కోసం ఇంటిలో ప్రత్యేక గదులను నిర్మించారు. ఎలాగూ అల్లు అర్జున్ ది సినిమా కుటుంబం కాబట్టి సినిమాలు చూసేందుకు ఓ ప్రత్యేక గదిని ఇంట్లో ఏర్పాటు చేశారు. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో అందంగా ఆహ్లాదంగా ఈ ఇంటిని నిర్మించారు. ఇంట్లో పచ్చని మొక్కలను ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదలయింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది.

Visitors Are Also Reading