Home » రామ్ చరణ్ “మగధీర”ను ఫాలో అయ్యి అల్లు అర్జున్ ను చేసిన ఆ సినిమా అట్టర్ ఫ్లాప్…!

రామ్ చరణ్ “మగధీర”ను ఫాలో అయ్యి అల్లు అర్జున్ ను చేసిన ఆ సినిమా అట్టర్ ఫ్లాప్…!

by AJAY
Ad

చిరంజీవి కుమారుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో రామ్ చరణ్. మొదటి సినిమా చిరుత తోనే రామ్ చ‌ర‌ణ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేకపోయింది. కానీ రామ్ చ‌ర‌ణ్‌ ఇండస్ట్రీలో రాణించగలుగుతారు అన్న నమ్మకం మెగా అభిమానులకు వచ్చింది. ఈ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి రామ్ చరణ్ తో మ‌గ‌ధీర సినిమాను తెరకెక్కించారు. ఎన్నో అంచనాల మధ్య న‌డుమ వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Advertisement

ఈ సినిమాతో రామ్ చరణ్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. ఈ చిత్రాన్ని 45 కోట్ల బడ్జెట్ తో అల్లు అరవింద్ నిర్మించగా భారీ కలెక్షన్లను రాబట్టింది. రెండో సినిమాకే రామ్ చ‌ర‌ణ్ మ‌గ‌ధీర అంత‌టి విజయాన్ని అందుకోవడం ఇండస్ట్రీలో చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఒక బ్యాక్ డ్రాప్ తో వ‌చ్చిన‌ సినిమా హిట్ అయితే వరుసగా అలాంటి సినిమాలే వస్తాయన్న‌ సంగతి తెలిసిందే.

Advertisement

మగధీర సినిమా తర్వాత కూడా అలాంటిదే జరిగింది. మగధీర సినిమా చూసిన అనంతరం అల్లు అర్జున్ కూడా భారీ బ‌డ్జెట్ తో తెరకెక్కిన బద్రీనాథ్ సినిమాలో నటించాడు. ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని కూడా భారీ విజువ‌ల్స్ తో నిర్మించారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ గంటల తరబడి జిమ్ లో కష్టపడ్డాడు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు పోస్టర్లు ఆకట్టుకోవడంతో మ‌గ‌ధీర రేంజ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా విడుదలైన తర్వాత చూస్తే క‌థ వీక్ గా ఉండటం విజువల్స్ కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అల్లు అర్జున్ అభిమానులను కూడా ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది.

Visitors Are Also Reading