Home » పుష్ప 2 ఆలస్యం.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న అల్లు అర్జున్..?

పుష్ప 2 ఆలస్యం.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న అల్లు అర్జున్..?

by Azhar
Ad

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గత ఏడాది చివర్లో విడుదలైన సినిమా పుష్ప. ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా మొత్తం పాన్ ఇండియా లెవల్ లో విడుదల అయ్యి సక్సెస్ అనేది అందుకుంది. ఈ సినిమాలోని బన్నీ మేనేరిజం ముఖ్యంగా అభిమానులను ఆకట్టుకుంది. కేవలం మాములు అభిమానులే కాకుండా స్టార్ సెలబ్రెటీలు కూడా పుష్ప మేనియాలో పడిపోయారు. ఇక ఇండియా, బంగ్లాదేశ్ క్రికెటర్స్ అందరూ ఈ పుష్ప స్టైల్ అనేది చేస్తూ.. అభిమానులను ఆకట్టుకున్నారు. ముఖంగా ”తగ్గేదే లే” అనే డైలాగ్ ను ప్రతి ఒక్కరు వాడేస్తున్నారు.

Advertisement

అయితే ఈ సినిమా కేవలం మొదటి భాగం మాత్రమే గత ఏడాది విడుదలైంది. ఇంకా అసలు కథ.. యాక్షన్స్ మొత్తం పుష్ప 2 లోనే ఉంటాయి. అందుకే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే పుష్ప 2 అనే సినిమా విడుదల అయిన తర్వాత సూపర్ హిట్ కావడమే కాకుండా.. భారీ కలెక్షన్స్ కుశ సాధిస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. అయితే లెక్కే ప్రకారం ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావాలి. ఎందుకంటే ఈ సినిమాను ఫిబ్రవరిలోనే ప్రారంభించాలి అనుకున్నారు. కానీ అనుకున్న దానికంటే ఎక్కువ విజయం సాధించడంతో కథలో కొన్ని మార్పులకు సిద్ధమయ్యాడు డైరెక్టర్ సుకుమార్.

Advertisement

ఇండియా వ్యాప్తంగా అభిమానులను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు చేస్తున్నారు. అందువల్ల ఈ సినిమా స్క్రిప్ట్ అనేది ఇంకా కూడా సిద్ధం కాలేదు. కాబట్టి షూటింగ్ ప్రారంభం కావటానికి ఇంకా సమయం పడుతుంది. అందువల్ల ఇప్పుడు అల్లు అర్జున్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేంటంటే… ఈ సినిమా కంటే ముందే మరో సినిమా చేయాలి అనే ఆలోచనలో బన్నీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులు పుష్ప తర్వాత పుష్ప 2 వస్తే బాగుంటుంది అనుకున్న బన్నీ ఇప్పుడు ఇంకో సినిమా చేయాలనీ సిద్ధమైనట్లు.. ఈ సినిమా ప్రకటన కూడా త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ సెంచరీ పై ఇంగ్లాండ్ వివాదాల కామెంటేటర్ షాకింగ్ కామెంట్స్..!

తన భర్త కెప్టెన్ తేలిగ్గా కాలేదు అంటున్న సంజనా..!

Visitors Are Also Reading