Telugu News » Blog » నా అన్న చ‌ర‌ణ్, బావ తార‌క్ అంటూ అల్లు అర్జున్ ఎమోష‌నల్ ట్వీట్..!

నా అన్న చ‌ర‌ణ్, బావ తార‌క్ అంటూ అల్లు అర్జున్ ఎమోష‌నల్ ట్వీట్..!

by AJAY
Ads

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దాన‌య్య ఈ సినిమాను నిర్మించారు. ఇక సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా అలియా భట్ న‌టించ‌గా ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరీస్ న‌టించింది. అంతే కాకుండా ఈ సినిమాలో అజ‌య్ దేవ్ గ‌న్ శ్రీయ స‌ర‌న్ ముఖ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించారు.

Advertisement

ALLU ARJUN

ALLU ARJUN

ఇక మార్చి 25న విడుద‌లైన ఈ సినిమాకు బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ వినిపిస్తోంది. సినిమాలో విజువ‌ల్స్ పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఇక ఈసినిమాపై టాలీవుడ్ బాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రం పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్ర‌శంస‌లు కురిపించారు. సినిమా అద్భుతంగా ఉంద‌ని అల్లు అర్జున్ అన్నారు. చిత్ర యూనిట్ కు బ‌న్నీ శుభాకాంక్ష‌లు చెప్పారు. మ‌న‌మంతా గ‌ర్వ‌ప‌డే రాజ‌మౌళి విజ‌న్ గొప్ప‌గా ఉందని అల్లు అర్జున్ పేర్కొన్నారు.

Advertisement

అన్న రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో గుర్తుండిపోయే ప‌ర్ఫామెన్స్ చేశార‌ని అన్నారు. అందుకు గ‌ర్వంగా ఉంద‌ని….ప‌వ‌ర్ హౌస్ లాంటి నా బావ తారక్ షో చూస్తుంటే ముచ్చ‌టేస్తుంద‌ని పేర్కొన్నాడు. అత‌డంటే నాకు ఎప్పుడూ గౌర‌వం ఇష్ట‌మే…అజ‌య్ దేవ్ గ‌న్, అలియా చాలా భాగా చేశారు. దాన‌య్య‌, సెంథిల్ కుమార్, కీర‌వాణి అంద‌రికీ ప్ర‌త్యేక శుభాభినంద‌న‌లు…నింజంగా ఇది కిల్ల‌ర్….అంటూ బ‌న్నీ పేర్కొన్నాడు.