Home » స‌మంత‌పై ఆలియా కామెంట్స్‌.. ఎందుకో తెలుసా..?

స‌మంత‌పై ఆలియా కామెంట్స్‌.. ఎందుకో తెలుసా..?

by Anji

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఇంకా విడుద‌ల కాక‌ముందే అమ్ముడు టాలీవుడ్ మీద పుల్ ఆస‌క్తి చూపిస్తోంది. ఎన్టీఆర్ 30లో అవ‌కాశం వ‌చ్చింద‌ని వార్త‌లు గుప్పుమంటూ ఉన్నాయి. తాజాగా ముద్దుగుమ్మ టాలీవుడ్ మ‌రొక స్టార్‌తో న‌టించ‌డానికి ఆస‌క్తిక‌ర‌మైన చూపిస్తోంది. స్టార్ ఎవ‌రోకాదు.. స్టార్ హీరోయిన్ స‌మంత‌. ఆలియా న‌టించిన గంగూభాయ్ క‌తీయ‌వాడి విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది.

Also Read :  Mohanbabu : మోహన్ బాబు రాజకీయాలకు గుడ్ బై చెప్పడానికి కారణం అదేనా …!

ఈ త‌రుణంలో నిర్వ‌హించిన ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె మన‌స్సులో మాట‌ను వెల్ల‌డించింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఎవ‌రు అంటే ఇష్టం అని యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా.. కొద్దిసేపు ఆలోచించిన ఆలియా స‌మంత పేరు చెప్పింది. సామ్ ఒప్పుకుంటే ఆమెతో మ‌ల్టీస్టార‌ర్ చేయ‌డానికి కూడా సిద్ధ‌మేన‌ని పేర్కొంది.

ఫ్యామిలీ మ్యాన్‌-2లో సామ్ న‌ట‌న‌కు తాను ఫిదా అయ్యాన‌ని అవ‌కాశం వ‌స్తే ఆమెతో క‌లిసి సినిమా చేయాల‌నుకుంటున్నాను అని చెప్పింది. ఆలియాభ‌ట్ చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఆలియా మ‌న‌స్సులో మాట విన్న డైరెక్ట‌ర్లు ఇక క‌థ‌లు రాసే ప‌నిలో ప‌డిపోవాలేమో ఇద్ద‌రూ హీరోయిన్లు థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ ఇంకేముంది సినిమా హిట్‌. మ‌రీ ఈ ఇద్ద‌రినీ క‌లిపే ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో చూడాలంటున్నారు స‌మంత‌, ఆలియా భ‌ట్ అభిమానులు.

Also Read :  ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి.. ఎక్క‌డో తెలుసా..?

Visitors Are Also Reading