ఈ మధ్య కాలంలోనే వారి ప్రేమకు పుల్ స్టాప్ పెట్టి వివాహం ద్వారా ఒక్కటైన రణబీర్ కపూర్, ఆలియా భట్ దంపతులు మరో నూతన శకం లోకి అడుగు పెట్టారు. ఏప్రిల్లో ఒకటైన ఈ జంట అభిమానులకు మరో శుభవార్త అందించారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆలియాభట్ త్వరలో బేబీ రాబోతుంది అంటూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలలో కంప్యూటర్ మానిటర్ పై లవ్ సింబల్ పెట్టి కనిపిస్తోంది. దీంతో ఇది చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు..
Advertisement
ఏప్రిల్ 14 వ తేదీన ముంబైలో వీరి వివాహం జరిగింది ఇంతలోనే ప్రెగ్నెంట్ కన్ఫామ్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం ఆలియా భట్ అనేక సినిమాల్లో నటిస్తోంది. ఈమె తన తండ్రి మహేష్ బట్టు వారసత్వంగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె సినీ ఇండస్ట్రీ వారసత్వంగా వచ్చిన అది ఏమాత్రం ఉపయోగించకుండా తన సొంత టాలెంట్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని ముందుకు సాగుతోంది. ఆమె నటించిన మొట్టమొదటి మూవీ “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్”. ఈ సినిమా అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేసింది.
దీని తర్వాత హైవే, డియర్ జిందగీ, రాజి లాంటి మూవీస్ చేసి ఆలియా భట్ ఎంతో పేరు తెచ్చుకుంది. ఆమె ఇటీవల నటించిన గంగుబాయ్ కతీయవాడి, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇక త్రిబుల్ ఆర్ మూవీ లో చిన్న పాత్ర చేసిన ఆమె నటనా చాతుర్యం, హుందాతనంగా ఉండే పాత్ర ప్రేక్షకులను ఎంతో మైమరపించింది. అలాంటి ఆలియాభట్ తను తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. దీంతో పలువురు ప్రముఖులు ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
also read;
మహేష్ బాబు, రమేష్ బాబు లకు నందమూరి తారక రామారావు గారు చేసిన సహాయం గురించి తెలుసా ?
జక్కన్న కాస్త సమయం ఇచ్చి ఉంటే.. ఉదయ్ కిరణ్ అలా అయ్యేవారు కాదేమో..?