Home » అల్లు అర్జున్ కు ఆలియా భట్ గ్రీన్ సిగ్నల్…!

అల్లు అర్జున్ కు ఆలియా భట్ గ్రీన్ సిగ్నల్…!

by AJAY
Ad

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియాభట్ తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా అని ఆలియా భట్ పేర్కొంది. అంతేకాకుండా తనను ఇంట్లో ఆలు అని పిలుస్తారని తన కుటుంబ సభ్యులు పుష్ప సినిమా చూసినప్పటి నుండి ఆలు అల్లుతో ఎప్పుడు సినిమా చేస్తావని ఆటపట్టిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించింది.

alia bhatt

alia bhatt

దాంతో ఆలియాభట్ అల్లు అర్జున్ తో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మరి అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా లో అలియా భట్ కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి. ఇదిలా ఉండగా ఆలియా భట్ ఇప్పటికే తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమా లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించారు.

Advertisement

Advertisement

ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా ఆలియా నటించింది. ఇప్పటికే ట్రైలర్ విడుదల కాగా ఆలియా భట్ సీత లుక్ లో ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరోవైపు ఆలియాభట్ ఎన్టీఆర్ ఆర్ కొరటాల సినిమా లో నటించబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆలియాభట్ ప్రస్తుతం గంగు భాయ్ గైక్వాడ్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమాను కూడా తెలుగులో సినిమా తెరకెక్కింది.

Visitors Are Also Reading