రామ్ చరణ్ కు జోడిగా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి తెలుగు సినిమా అభిమానులకు దగ్గరైంది అలియా భట్. ఇక ఈ సినిమా విజయం సాధించిన ఇందులో తన పాత్ర చిన్నగా ఉండటం ఆమెకు నచ్చలేదు అని చర్చ జరిగింది. ఇదిలా ఉంటె.. బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అలియా భట్.. అందరికి షాక్ ఇస్తూ రణ్బీర్ కపూర్ ను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి అనేది చాలా సీక్రెట్ గా జరిగింది, ఇక విషయం బయటికి వచ్చిన తర్వాత అభిమానులు అయితే ఖంగు తిన్నారు అనే చెప్పాలి. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.
Advertisement
అయితే ఈ అలియా భట్, రణ్బీర్ కపూర్ పెళ్లి న్యూస్ నుండి ఇంకా ఫ్యాన్స్ బయట పడకముందే ఈ జంట మరో షాక్ అనేది ఫ్యాన్స్ కు ఇచ్చింది. అలియా భట్ తాను తల్లిని కాబోతున్నాను అని ప్రకటించింది. పెళ్లి అయ్యి ఇంకా సరిగ్గా మూడు నెలలు కూడా పూర్తికాకముందే అలియా ప్రగ్నెట్ కావడంతో ఫ్యాన్స్ రకరకాలుగా రియాక్ అయ్యారు. చాలా మంది ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పగా.. మరి కొందరు నెగెటివ్ కామెంట్స్ చేసారు. అదలా ఉంటె ఇప్పుడు అలియా భట్ తాజాగా షో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు. వివాదాలకు పెట్టింది పేరుగా ఉండే ఈ షో యొక్క కొత్త సీజన్ ఈ మధ్యే ప్రారంభమైంది.
Advertisement
ఇక ఈ షోకి తాజాగా అలియా, రన్ వీర్ సింగ్ వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో అనేది ఇప్పుడు ట్రేండింగ్ లో ఉంది. అయితే ఈ కార్యక్రమం హోస్ట్ అయిన కరణ్ జోహార్ ప్రోమోలో అలియాను ఓ ప్రశ్న అడిగాడు. పెళ్లి తర్వాత మీ ఫస్ట్ డెస్టినేషన్ ఏది అని ప్రశ్నించాడు. అయితే దీనికి అలియా కొంచెం బోల్డ్ గా స్పందించింది. కరణ్ ప్రశ్నకు సమాధానము ఇస్తూ.. పెళ్లి తర్వాత ఈ ఫస్ట్ నైట్ అనేది ఉండదు. ఎందుకంటే అప్పటికే చాలా అలిసిపోయి ఉంటాం అని పేర్కొంది. ఇక అలియా ఫస్ట్ నైట్ ఇలా మాట్లాడటంతో ఈ ప్రోమో అనేది తెగ వైరల్ అవుతుంది.
ఇవి కూడా చదవండి :