Home » RRR : అలిగిన అలియా భ‌ట్…రాజ‌మౌళిని అన్ ఫాలో చేసి ఆ పోస్ట్ లు డిలీట్..!

RRR : అలిగిన అలియా భ‌ట్…రాజ‌మౌళిని అన్ ఫాలో చేసి ఆ పోస్ట్ లు డిలీట్..!

by AJAY
Ad

రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ హీరోలుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌హించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను దాన‌య్య నిర్మించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భ‌ట్…హీరో అజ‌య్ దేవ్ కూడా న‌టించింన సంగ‌తి తెలిసిందే. అయితే సినిమాలో క‌థ ఆధారంగా రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ ల‌కు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ను ఇచ్చారు. దాంతో అలియా భ‌ట్ కు స్క్రీన్ స్పేస్ త‌క్కువైంది. అంతే కాకుండా రామ్ చ‌ర‌ణ్ ,ఎన్టీఆర్ మిన‌హా ఎవ‌రికీ ఎక్కువ స్క్రీన్ స్పేస్ ద‌క్క‌లేదు.

Advertisement

అయితే త‌మ హీరోయిన్ అలియా భ‌ట్ కు స్క్రీన్ స్పేస్ త‌క్కువ ఇవ్వ‌డంతో ఆమె అభిమానులు బాలీవుడ్ ప్రేక్ష‌కులు హ‌ర్ట్ అవుతున్నారు. అయితే కేవ‌లం అలియా భ‌ట్ అభిమానులు మాత్ర‌మే కాకుండా బ్యూటీ కూడా హ‌ర్ట్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు అందుతున్నా కూడా అలియా భ‌ట్ మాత్రం సినిమా విజ‌యం పై ఒక్క‌సారి కూడా స్పందించ‌లేదు.

Advertisement

అంతే కాకుండా త‌న ఇన్స్ట్రా గ్రామ్ ఖాతా నుండి కూడా అలియా భ‌ట్ రాజ‌మౌళిని అన్ ఫాలో చేసిన‌ట్టు స‌మాచారం. అక్క‌డితో ఆగ‌కుండా ఆర్ఆర్ఆర్ సినిమా పోస్ట్ ల‌ను కూడా అలియా భ‌ట్ డిలీట్ చేయ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. దాంతో అలియా భ‌ట్ అలిగింద‌ని అందువల్లే రాజ‌మౌళిని అన్ ఫాలో కొట్టేసి…ఆర్ఆర్ఆర్ పోస్ట్ ల‌ను కూడా డిటీట్ చేసింద‌ని గుసుగుస‌లు వినిపిస్తున్నాయి.

intresting scene at rrr trailer launch event

రాజ‌మౌళితో సినిమా అన‌గానే అలియా భ‌ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకుంద‌ట‌. కానీ విడుద‌ల‌య్యాక అవుట్ పుట్ చూసి నిరాశ చెంది ఈ ప‌నిచేసింద‌ట‌. రీసెంట్ గా అలియా భ‌ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా గంగూబాయి గైక్వాడి తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. అంత‌టి మార్కెట్ ఉన్న త‌నకు ఆర్ఆర్ఆర్ లో ప్రాధాన్య‌త లేక‌పోవడం వ‌ల్లే అలియా భ‌ట్ హ‌ర్ట్ అయ్యిందేమో.

Also Read: కైకాల స‌త్య‌నారాయ‌ణ య‌ముడి పాత్ర‌లో న‌టించిన సినిమాలు ఇవే..!

Also Read: ఐపీఎల్ వేలం గురించి ర‌విశాస్త్రీ ఏమ‌న్నారో తెలుసా..?

Visitors Are Also Reading