Telugu News » Blog » ఆ హీరోయిన్ తో ఆలీకి పెళ్లయిందని అప్పట్లో పుకార్లు ! ఆలీ సతీమణి అప్పుడు ఏమి చేసిందంటే ?

ఆ హీరోయిన్ తో ఆలీకి పెళ్లయిందని అప్పట్లో పుకార్లు ! ఆలీ సతీమణి అప్పుడు ఏమి చేసిందంటే ?

by Manohar Reddy Mano
Ads

మన తెలుగు ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా స్టార్ డమ్ సంపాదించుకున్న కమెడియన్లు బ్రహ్మానందం మరియు ఆలీ. అయితే ఇందులో ఆలీ ఓ బాల నటునిగా సినిమా ప్రపంచంలోకి వచ్చి.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ.. కమెడియన్ గా.. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 1994 లో పెళ్లి చేసుకున్న ఆలీ… తెలుగు ప్రజలను ఎంతో నవ్వించాడు. కానీ ఆలీకి సంబంధించిన ఒక్క విషయంలో ఆలీభార్య మాత్రం ఏడ్చేసిందట.

Ads

అసలు ఏం జరిగిందంటే… ఆలీ హోస్ట్ గా వస్తున్న ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి తాజాగా శుభశ్రీ వచ్చారు. ఈ షోలో తనకు గతంలో జరిగిన ఓ సంఘటన గురించి ఆలీ చెప్పారు. సినీ ప్రపంచంలోకి కన్నడ స్టార్ హీరోయిన్ మాలాశ్రీ చెల్లెలుగా ఎంట్రీ ఇచ్చిన ఆమే, తెలుగు తమిళ్ సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆలీ, శుభశ్రీ కలిసి అప్పట్లో కొన్ని సినిమాల్లో జంటగా నటించారు. వీరి సినిమాలు హిట్ కావడంతో.. పుకార్లు మొదలయ్యాయి. వీరిద్దరూ కలిసి సినిమాలో ఓ పెళ్లి సన్నివేశంలో నటిస్తుండగా.. వారిని ఫోటో తీసి.. ఆలీ, శుభశ్రీ పెళ్లి చేసుకున్నట్లు ఓ మ్యాగజిన్ లో ప్రచురించారు.

Ads

అయితే అదే రోజు… పుట్టింటికి వెళ్తున్న తన భార్యను ట్రేన్ ఎక్కించడానికి ఆలీ.. స్టేషన్ కు వెళ్లగా.. ఆయన మామగారు అదే మ్యాగజిన్ ను పక్కనే ఉన్న షాపులో కొన్నారు. అందులో ఆలీ పెళ్లి గురించి చదివి.. ట్రేన్ దిగిన తర్వాత ఆలీకి మరో పెళ్లి అయినట్లు ఆయన భార్యకు చెప్పారు. దాంతో మరోసారి రోజే అత్తగారి ఇంటికి వచ్చిన ఆమె… ఆలీ అమ్మగారితో ఈ రెండో పెళ్లి గురించి చెప్పి ఏడవటం ప్రారంభించారు. దాంతో ఆలీ వచ్చి.. అది అంత అబద్ధం.. సినిమాలో మేము అలా నటించాం అంతే అని.. ఆమెకు ఇంతకముందే పెళ్లి కూడా అయ్యిందని సర్ది చెప్పారు. అయితే ఆలీ ఈ విషయం మొత్తం షోలో చూపిన తర్వాత… నాకు ఈ పుకారు గురించి తెలియదని శుభశ్రీ చెప్పడం గమనార్హం.

ఇవి కూడా చదవండి :

పృథ్వీ షా 100 టెస్టులు ఆడుతాడు…!

Ad

ట్రాన్స్ జెండర్లు ఎప్పుడైనా కలలో కనిపించారా..? అయితే దాని అర్ధం ఇదే..?