Telugu News » Blog » పవన్ కళ్యాణ్ తన కూతురు పెళ్లికి ఎందుకు రాలేదో అసలు విషయాన్ని బయటపెట్టిన ఆలీ..!

పవన్ కళ్యాణ్ తన కూతురు పెళ్లికి ఎందుకు రాలేదో అసలు విషయాన్ని బయటపెట్టిన ఆలీ..!

by Anji
Ads

టాలీవుడ్ హాస్య నటుడు ఆలీ కూతురు పెళ్లి నవంబర్ 27న హైదరాబాదులో అంగ రంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ తారలు, ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీకి చెందిన దగ్గర తారలు చాలావరకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడంతో ఈ విషయము తీవ్ర చర్చకు దారి తీసింది. పవన్ కళ్యాణ్ ఆలీ మంచి స్నేహితులనే విషయము తెలిసిందే. ఇదివరకు దాదాపు పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి సినిమాలో కూడా ఆలీ పాత్ర కచ్చితంగా ఉండేది. ఈ మధ్యకాలంలో ఉండడం లేదు.

Advertisement

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అలీ లేకుండా తీసిన సినిమాలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. స్నేహితుడు కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్ రాకపోవడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో ఆలీ వైసీపీకి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నర సంవత్సరాల తర్వాత ఆలీని ఇటీవలే ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుడిగా నియమించింది. ఈ కారణంగానే పవన్ కళ్యాణ్, ఆలీకి విభేదాలు వచ్చాయనే వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఆలీ కూతురు పెళ్లికి రాకపోవడానికి ఇదే కారణం అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది.

Advertisement

Also Read :  జెమినీ గణేషన్ సావిత్రి నుండి సూర్య జ్యోతిక వరకు.. హీరోయిన్లను పెళ్లి చేసుకున్న తమిళ హీరోలు..!!

Manam News

తాజాగా ఈ విషయంపై ఆలీ తాజాగా స్పందించారు. ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూకి హాజరయ్యారు ఆలీ. ఇందులో  పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన కూతురు పెళ్లికి రాకపోవడానికి కారణం పై కూడా క్లారిటీ ఇచ్చారు. ఫిలిం సిటీలో షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ తో పాటు చిత్ర బృంద అందరికీ శుభలేఖ ఇచ్చానని.. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా పెళ్లికి వస్తానని చెప్పారని తెలిపారు. ఫ్లైట్ క్యాన్సల్ కావడంతో పవన్ కళ్యాణ్ పెళ్ళికి రాలేకపోయారని ఆలీ తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ తనకు ఫోన్ చేసి మాట్లాడారని.. తర్వాత తానే నేరుగా వచ్చి కలుస్తానని చెప్పారని ఆలీ తెలిపారు.

Advertisement

Also Read :   ఒకే ప్రేమ్ లో కనిపించనున్న బాలయ్య, ప్రభాస్.. అభిమానులకు పండుగే..!