Telugu News » Blog » తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్…ఆ పరీక్షల షెడ్యూల్ లో మార్పు. మారిన తేదీలు ఇవే..

తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్…ఆ పరీక్షల షెడ్యూల్ లో మార్పు. మారిన తేదీలు ఇవే..

by Bunty
Ads

 

తెలంగాణ సెట్ అభ్యర్థులకు అలర్ట్. తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాల లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెట్ పరీక్షలు నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ముగిసింది.

Advertisement

READ ALSO : భూమా మౌలిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా… మనోజ్ కంటే ఎక్కువైనా?

డిసెంబర్ 30 నుంచి అప్లికేషన్స్ ను స్వీకరించారు. ఇదిలా ఉంటే, ఈ అర్హత పరీక్ష షెడ్యూల్ లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో పరీక్షల తేదీని రీ షెడ్యూల్ చేశారు. మార్చి 13న జరగాల్సిన పరీక్షను 17వ తేదీన నిర్వహించనున్నారు.

Advertisement

READ ALSO : “వీర సింహారెడ్డి” ఎవరో నాకు తెలీదు.. విలన్ డైలాగ్ పై ట్రోలింగ్

అయితే 14, 15 తేదీలలో జరగాల్సిన పరీక్షలను మాత్రం ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. ఈ విషయమై టీఎస్ సెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ సి.మురళీకృష్ణ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు, రీషెడ్యూల్ చేసిన ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను మార్చి 10 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

Advertisement

READ ALSO : Citadel : ‘సిటాడేల్’ విడుదల ఖరారు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

You may also like