Home » ఇంటికి సిలిండ‌ర్ డెలివ‌రీ చేయాలంటే ఇకనుంచి ఆ కోడ్ త‌ప్ప‌నిస‌రి..!

ఇంటికి సిలిండ‌ర్ డెలివ‌రీ చేయాలంటే ఇకనుంచి ఆ కోడ్ త‌ప్ప‌నిస‌రి..!

by Bunty
Ad

మీరు గ్యాస్‌ను వినియోగిస్తున్నారా..? త‌రుచూ ఇంటికి గ్యాస్ సిలిండ‌ర్ డెలివ‌రీ వ‌స్తుందా..? అయితే ఈ విష‌యం మీకోస‌మే..!వాస్త‌వానికి ఇండియ‌న్ ఆయిల్‌.. ఇండెన్ గ్యాస్ వినియోగ‌దారుల‌కు అనేక సేవ‌ల‌ను అందిస్తోంది. అంతేకాకుండా గ్యాస్ సిలిండ‌ర్లు వినియోగ‌దారుల ఇండ్ల‌కు చేరే విధంగా జాగ్ర‌త్త‌లు కూడా తీసుకుంటుంది. దీనికోసం ఇండియ‌న్ ఆయిల్ ప్ర‌త్యేక కోడింగ్ సిస్టంను ఏర్పాటు చేసింది. అదే డీఏసీ కోడ్‌.

DAC కోడ్ ద్వారా మీరు ఇంటికి గ్యాస్ సిలిండ‌ర్ ను ఆర్డ‌ర్ చేసుకోవ‌చ్చు. డీఏసీ కోడ్ అంటే ఏమిటి..? సిలిండ‌ర్ డెలివ‌రీలో దాని పాత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

డీఏసీ కోడ్ అనేది ఒక ర‌క‌మైన కోడ్.. దీని పూర్తి పేరు (Delivery Authentication Code) డెలివ‌రీ ప్రామాణీక‌ర‌ణ కోడ్‌. ఇండెన్ గ్యాస్ సిలిండ‌ర్ బుకింగ్ చేసిన స‌మ‌యంలోఈ కోడ్ ఎస్ఎంఎస్ ద్వారా మీ రిజిస్టర్ మొబైల్ నెంబ‌ర్‌కు వ‌స్తుంది. ఇది ఒక విధంగా ఓటీపీగా పని చేస్తుది. ఇంటికి గ్యాస్ సిలిండ‌ర్ డెలివ‌రీ చేసేందుకు వ‌చ్చిన వ్య‌క్తికి మీరు ఈ డీఏసీ చెబితే కానీ అత‌డు మీకు సిలిండ‌ర్ అప్ప‌గిస్తాడు. దీంతో గ్యాస్ సిలిండ‌ర్ హోం డెలివ‌రీ ప్ర‌క్రియ ముగుస్తుంది. డీఏసీ క‌స్ట‌మ‌ర్ మొబైల్‌కు వ‌చ్చే ఆ నాలుగు అంకెల కోడ్‌. ఇక నుంచి గ్యాస్ డెలివ‌రీ బాయ్ వ‌చ్చి డీఏసీ కోడ్ చెప్ప‌కుండా సిలిండ‌ర్ డెలివ‌రీ చేయ‌రు అని టాక్ సోష‌ల్ మీడియాలో వినిపిస్తుంది. ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో ఈ ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభం అయిన‌ట్టు తెలుస్తుంది. తొలుత దేశ‌వ్యాప్తంగా ఈ ప్ర‌క్రియ‌ను 100 స్మార్ట్ సిటీల‌లో ప్రారంభించి ఆ త‌రువాత దేశ‌వ్యాప్తంగా దీనిని అమ‌లు చేయాల‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం దీనిని ప్ర‌వేశ‌పెట్టింది.
Also Read: ప‌క్ష‌వాతం రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఏమిటో తెలుసా..?

Visitors Are Also Reading