Telugu News » Blog » తెలంగాణలో మద్యం నిషేధం.. ఎప్పుడో తెలుసా.. ఆ నేత ఏమంటున్నారు..?

తెలంగాణలో మద్యం నిషేధం.. ఎప్పుడో తెలుసా.. ఆ నేత ఏమంటున్నారు..?

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలంగాణలో ప్రతి సంవత్సరం మద్యం విపరీతంగా పెరిగిపోతోంది. కేసీఆర్ సర్కార్ వచ్చిన తర్వాత మద్యం రేట్లు కూడా బాగా పెరిగాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ నేత హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా అధికంగా మద్యం అమ్ముడయ్యే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని లిక్కరే రాష్ట్రానికి ఆయువుపట్టుగా ఉన్న విషయం అందరికి తెలిసిందే అని అన్నారు.

Advertisement

మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం కోసం కేసీఆర్ సూచనల మేరకే ప్రతి ఊర్లో బెల్టుషాపులు మద్యం అక్రమ దందా నడుస్తోందని పోలీసులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తున్నారని విమర్శించారు. కారణం ఏమైనా సరే గానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయని మద్యం కారణంగా నేరాలు కూడా విచ్చలవిడిగా పెరిగాయని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మద్యనిషేధం చేస్తామని విహెచ్ సంచలన ప్రకటన చేశారు.

Advertisement

ప్రస్తుతం తెలంగాణ తాగుబోతులు అడ్డాగా మారిందని వ్యాఖ్యానించారు. బంగారు తెలంగాణలా చేస్తానని తాగుబోతుల అడ్డాగా మార్చారని విహెచ్ మండిపడ్డారు. తెలంగాణ మద్యం అడ్డాగా మారిన కేసీఆర్ పై తిరగబడేందుకు మహిళలు రోడ్డుపైకి రావాలని విహెచ్ పిలుపునిచ్చారు. మహిళలతో కలిసి మద్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం మద్యం నిషేధం తప్పనిసరిగా ఉంటుందని అన్నారు.