అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వారు పసుపు ముద్దతో ఇలా చేస్తే కోట్లు పెట్టి బంగారం కొన్న ఫలితం వస్తుంది. అలాగే బంగారు స్వర్ణ యోగం కలుగుతుంది. మరి అక్షయ తృతీయ రోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. భారతీయులకు బంగారానికి విడదీయలేని బంధం ఉంది. ప్రతి ఇంట్లోని మహిళలు ఎంతో కొంత బంగారు ఆభరణాలను చేయించుకుంటారు. ముఖ్యంగా పండుగలు, పర్వదినాలలో బంగారాన్ని కొంటారు. అటువంటి పండగే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే అదృష్టం కలిసొస్తుందని భారతీయుల నమ్మకం.
Advertisement
ఈ శుభదినాన బంగారం కొనేందుకు నగల దుకాణానికి వెళ్తారు. అక్షయ తృతీయ రోజు తప్పకుండా బంగారు,వెండిని కొనడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఆ రోజు బంగారం కొనలేని వారు ఈ పూజ చేస్తే ఎనలేని ధనప్రాప్తి కలుగుతుంది. సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి, పూజామందిరాన్ని శుభ్రపరిచి దేవుని పటాలకు పసుపు, కుంకుమలు,పువ్వులతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత దీపాలను కూడా పసుపు,కుంకుమ,పువ్వులతో అలంకరించుకొని దీపాలు వెలిగించుకోవాలి.
Advertisement
పూజ మందిరంలో రంగవల్లికలు వేసి దానిపై ఓ పీఠను ఉంచి దాని కింద పసుపు, బియ్యం, నాణాలు పెట్టాలి. ఈ విధంగా కలశం ఏర్పాటు చేసుకోవాలి. కలశానికి ముందు అరటి ఆకులో బియ్యాన్ని వేసి దానిపై వెలిగించిన దీపాన్ని ఉంచాలి. పసుపులో వినాయకుడిని చేసి దానికి పువ్వులు,కుంకుమ పెట్టుకోవాలి. కొత్త వస్త్రాలు బంగారం గనుక ఉంటే కలశానికి ముందు పెట్టుకోవాలి. చక్కెర పొంగలి, పాలతో పాయసం నైవేద్యంగా పెట్టాలి. ఇలా పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అక్షయ తృతీయ రోజు దానం చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలిగి సత్ఫలితాలు వస్తాయి.
ALSO READ;
ప్రాంక్ లొల్లి..గెట్ అవుట్ అంటూ విశ్వక్ సేన్ పై దేవినాగవల్లి ఫైర్…వీడియో వైరల్…!
ఆలయాన్ని కాపలా కాస్తున్న ఎలుకలు.. అంతుచిక్కని రహస్యాలు మరెన్నో.. ఎక్కడంటే..!!