టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓపెనర్ గా టీం ఇండియాకు ఎన్నో మర్చిపోలేని విజయాలను అందించాడు. తక్కువ సమయంలోనే ఎంతో పేరును తెచ్చుకున్న శిఖర్ ధావన్ వ్యక్తిగతంగా బాధలను దిగమింగుకుంటూ గడుపుతున్నాడు. పైకి సరదాగా కనిపించే శిఖర్ ధావన్ తన గుండెల్లో అగ్నిపర్వతాన్నే మోస్తున్నాడు. భార్య నుంచి విడిపోయాక కొడుకును చూడలేక నరకయాతను అనుభవిస్తున్నాడు.
తన కుమారుడిని అతను ఎంతలా మిస్ అవుతున్నాడో ఇటీవల తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా పెట్టిన పోస్ట్ చూస్తే అర్థమవుతుంది. కన్నా నిన్ను చూసి ఏడాది అవుతుంది. నా నుండి నిన్ను దూరం చేసేందుకు నన్ను బ్లాక్ చేశారు అంటూ ధావన్ భావోద్వేగంతో పోస్ట్ పెట్టాడు. దావన్ పెట్టిన ఈ పోస్ట్ కు చలించిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ దావన్ కు అండగా నిలిచాడు. ఒక తండ్రిగా పిల్లలను కలుసుకోకుండా దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు అక్షయ్. ధావన్ తన కొడుకును కలుసుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.
Advertisement
అందుకోసం ప్రార్థిస్తున్నారని, దేవుడి ఆశీస్సులు ధావన్ కు ఉంటాయని తెలిపాడు. 2010లో వన్డేల్లో అరంగేట్రం చేసిన శిఖర్ ధావన్ ఓపెనర్ గా రోహిత్ తో కలిసి అనేక రికార్డులను కొల్లగొట్టాడు. 2013 ఛాంపియన్ ట్రోఫీతో అతని అదృష్టం మారిపోయింది. అప్పటి నుంచి ఏడేళ్లపాటు టీమిండియా తరపున అద్భుత ప్రదర్శన చేశాడు. 167 వన్డేల్లో 17 సెంచరీలతో సహా 45 సగటుతో 6,793 పరుగులు చేశాడు. 34 టెస్టుల్లో 2,315 పరుగులు, ఏడు సెంచరీలు చేశాడు. 68 టీ20 మ్యాచ్ లు ఆడిన శిఖర్ ధావన్ 1800 పరుగులు చేశారు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.