Home » నన్నే తిట్టండి అంటున్న అక్షయ్ కుమార్..!

నన్నే తిట్టండి అంటున్న అక్షయ్ కుమార్..!

by Azhar
Ad

బాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలలో అక్షయ్ కుమార్ కూడా ఒక్కడు. అయితే గతంలో ఒక్క హీరో ఏడాదికి ఐదు ఆరు సినిమాలు విడుదల చేసినట్లు.. ఇప్పుడు అక్షయ్ కుమార్ అలాగే చేస్తాడు. ఈయన చాల వేగంగా సినిమాలు అనేవి చేస్తూ పోతుంటాడు. అవి హిట్ అయిన.. ప్లాప్ అయిన తన షూటింగ్ మాత్రం ఆగదు. అయితే ఈ ఏడాది ఇప్పటికే అక్షయ్ కుమార్ యొక్క మూడు సినిమాలు వచ్చాయి.

Advertisement

అందులో బచ్చన్‌ పాండే, సమ్రాట్ పృథ్వీరాజ్‌ తో పాటుగా ఈ నెల 12న వచ్చిన రక్షాబంధన్‌ అనే సినిమా కూడా ఉంది. కానీ ఈ మూడు సినిమాలు కూడా పెద్దగా వసూళ్లు అనేవి చేయలేదు. ప్రజలను ఆకట్టుకోవడంలో కూడా విఫలం అయ్యాయి. అయితే వచ్చే నెల 2న అక్షయ్ కుమార్ యొక్క మరో సినిమా కట్‌పత్లీ విడుదల కానుంది. దీని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనేది ఈరోజు నిర్వహించారు.

Advertisement

అయితే ఇందులో అక్షయ్ కుమార్ తన సినిమాలు ప్లాప్ కావడంపై మాట్లాడుతూ.. నా సినిమాలు ఏవైనా ప్లాప్ అయితే కేవలం నన్ను మాత్రమే తిట్టండి అని చెప్పారు. అలాగే ఇక నుండి అభిమానులకు ఏ సినిమాలు నచ్చుతాయో.. వారు ఏ సినిమాలు చూడాలనుకుంటారో అలాంటి సినిమానే తీస్తాను అని చెప్పారు. అయితే ఈ కట్‌పత్లీ అనే సినిమా తమిళ్ సినిమా అయిన రాక్షసన్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది.

ఇవి కూడా చదవండి :

వరల్డ్ కప్ జట్టును బీసీసీఐ ఎప్పుడు ప్రకటిస్తుందో తెలుసా..?

కూతుర్ల కోసం పెద్ద నిర్ణయం తీసుకున్న వార్నర్..!

Visitors Are Also Reading