Home » నాగార్జున కొత్త కోడ‌లును వెతికారా..? ముహూర్తం కూడా ఫిక్స్ చేశాడా..?

నాగార్జున కొత్త కోడ‌లును వెతికారా..? ముహూర్తం కూడా ఫిక్స్ చేశాడా..?

by Anji

అక్కినేని కుటుంబానికి నాగేశ్వ‌ర‌రావు పెద్ద పునాది వేసిన విష‌యం విధిత‌మే. ఈ ఫ్యామిలీ నుంచి నాగార్జున‌, సుమంత్‌, సుశాంత్‌, సుప్రియ‌, నాగ‌చైతన్య‌, అఖిల్ ఇలా సినిమా రంగంలో ఉన్నారు వీరు. ప్ర‌స్తుతం కూడా రాణిస్తూనే ఉన్నారు. మ‌రొక వైపు అన్నపూర్ణ స్టూడియోల ద్వారా సినిమా షూటింగ్‌లు, టీవీ షో, ఈవెట్లు, సినిమా ఓపెనింగ్‌కు కేరాఫ్‌గా మార్చారు. అయితే అక్కినేని ఫ్యామిలీని విడాకులు బ్రేక‌ప్‌లు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. తొలుత నాగార్జున‌కు ఇదే మాదిరిగా జ‌రిగింది.

Also Read :  స‌ర్కారు వారి పాట క‌ళావ‌తి సాంగ్ లీక్‌..?

ఇప్పుడు నాగ‌చైత‌న్య ప‌రిస్థితి అదేవిధంగా కొన‌సాగుతుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే నాగ‌చైత‌న్య‌, సమంత దంప‌తులు ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించడం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ముఖ్యంగా స‌మంత నుంచి విడిపోయిన త‌రువాత చైతూ చాలా డిప్రెష‌న్‌కు లోనవుతున్నాడ‌ని స‌మాచారం. అందుకే త్వ‌ర‌లో అత‌నికి త‌గ్గ అమ్మాయిని చూశార‌ని, ఆమెతో ఈ ఏడాది చివ‌రిలో పెళ్లి కూడా జ‌రిపించ‌నున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో తెగ వార్త‌లు వినిపిస్తున్నాయి.


అక్కినేని కోడ‌లుగా ఉన్న స‌మంత త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లోంచి అక్కినేని అనే పేరు తొల‌గించి కేవ‌లం ఎస్ అనే అక్ష‌రంతోనే త‌న ప్రొఫైల్ నేమ్ అప్‌డేట్ చేసింది. ఇది చూసిన నెటిజ‌న్లు ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తూ వ‌చ్చారు. ఈ త‌రుణంలోనే గ‌త ఏడాది అక్టోబ‌ర్ 02న నాగ‌చైత‌న్య‌, స‌మంత దంప‌తులు విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. చివ‌రిగా నాగార్జున‌-నాగ‌చైత‌న్య క‌లిసి బంగార్రాజు సినిమా చేయ‌గా ఈ సినిమా మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. క‌రోనా కార‌ణంగా పెద్ద‌సినిమాలు అన్ని వాయిదా ప‌డ‌టంతో బంగార్రాజుకు క‌లిసొచ్చింద‌నే చెప్పాలి.

Also Read :  PAYALGHOSH : తారక్ గ్లోబల్ స్టార్…బాలీవుడ్ ను టాలీవుడ్ బీట్ చేస్తుంది…!

Visitors Are Also Reading