Telugu News » Blog » ముదురుతున్న అక్కినేని వర్సెస్ బాలయ్య వివాదం… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్ అసోసియేషన్….!

ముదురుతున్న అక్కినేని వర్సెస్ బాలయ్య వివాదం… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్ అసోసియేషన్….!

by AJAY
Ads

రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా విజయోత్సవ సభలో సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ స్పీచ్ లో మాట్లాడుతూ… షూటింగ్ లో నాన్నగారు ఆ రంగారావు.. ఈ రంగారావు అక్కినేని తొక్కినేని ఇవే మాట్లాడుకునే వాళ్ళం అంటూ వ్యాఖ్యానించారు. కాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.

Advertisement

బాలయ్య చేసిన కామెంట్లపై ఇప్పటికే అక్కినేని వారసుడు నాగచైతన్య స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నందమూరి తారక రామారావు గారు.. అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరచుకోవడం అంటూ నాగచైతన్య తన పోస్ట్ లో పేర్కొన్నారు.

Advertisement

కాగా ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ సైతం బాలయ్య పై ఫైర్ అవుతున్నారు. తాజాగా ఆల్ ఇండియా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ బాలయ్య పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అక్కినేని కుటుంబానికి బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. మహానటులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు అని వ్యాఖ్యానించింది. బాలకృష్ణ వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని పేర్కొంది. ఆయన స్టేజి ఎక్కితే ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదని పేర్కొంది. బాలయ్య మాటలు తెలుగు ఇండస్ట్రీని అవమానపరిచినట్లు అంటూ పేర్కొంది.

ఇదిఇలా ఉంటే బాలయ్య అభిమానులు మాత్రం కావాలని బాలయ్య స్పీచ్ లో అలా మాట్లాడలేదు ఫ్లో లో వచ్చింది అని చెబుతున్నారు. అంతేకాకుండా సినిమా షూటింగ్ సమయంలో ఒకప్పటి గొప్ప నటుల గురించి ఇలా చర్చించుకుంటాం.. అని చెప్పేటప్పుడు అలా అన్నారని దానికి కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also read : ప్రాణ స్నేహితులుగా ఉన్న ఎన్టీఆర్-ఏఎన్నార్ మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏంటో తెలుసా ?