బిగ్ బాస్ టీవీ షో ద్వారా అంతకముందు పాపులారి ఉన్నవారికి ఉన్న పాపులారిటీ కూడా పోతే..ఎలాంటి పాపులారిటీ లేకుండా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారికి మాత్రం ఎంతో కొంత పాపులారిటీ వస్తుంది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తరవాత కొద్దిరోజులు ఇంటర్వ్యూలలో బిజీ అవుతారు. టీవీ షోలు సినిమాలు ఇలా వరుస ఆఫర్లను అందుకుంటారు. ఇక తెలుగులో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పలువురు కంటెస్టెంట్ లు ఇప్పుడు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మండ, సోహెల్ మరియు బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ కూడా హీరోగా ఎంట్రీకి సిద్దం అవుతున్నాడు.
ALSO READ : ఆ దర్శకుడు నన్ను మోసం చేశాడు..నటి జయవాణి ఓపెన్ కామెంట్స్…!
Advertisement
Advertisement
అయితే వీరందరూ బయట మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. ఒకరి సినిమాలకు మరొకరు సపోర్ట్ చేసుకుంటూ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇక సన్నీ సకలగుణాభిరామ అనేసినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరగ్గా బిగ్ బాస్ కంటెస్టెంట్ లు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే సోహెల్ కూడా హాజరయ్యాడు.
కాగా స్టేజిపై సన్నీ సోహెల్ తో వీడి కప్పు పట్టుకుని వస్తాడనుకుంటే డబ్బులు తీసుకుని బయటకు వచ్చాడు. నాకు పదిలక్షలు ఎక్కువే ఆఫర్ చేశారు. కానీ మా వెళ్లే ముందే కప్పు ముఖ్యం అని చెప్పింది అంటూ సోహెల్ ను అవమానించినట్టుగా మాట్లాడాడు. కాగా ఈ కామెంట్లపై తాజాగా సోహెల్ ఫ్రెండ్ బిగ్ బాస్ 4 రన్నరప్ అఖిల్ షాకింగ్ కామెంట్లు చేశాడు.
మీ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ కు ఆహ్వానిస్తే వారికి గౌరవం ఇవ్వండి అంతేగానీ అవమానపరచకండి. మనం హీరో అవ్వడానికి పక్కవాళ్లను జీరోలను చేయొద్దు బ్రదర్. నా స్నేహితుడిని ఆ స్టేజిపై చూడటం బాధగా అనిపించింది. ఆ స్థానంలో నేను ఉండాల్సింది. అంటూ ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. అయితే అఖిల్ పేరును మాత్రం ప్రస్థావించలేదు. కానీ నెటిజన్లు అఖిల్ సన్నీకే కౌంటర్ ఇచ్చాడని కామెంట్లు చేస్తున్నారు.