Home » మోస్ట్ బ్యాచుల‌ర్ ఎలిజిబుల్ ఏజెంట్‌…

మోస్ట్ బ్యాచుల‌ర్ ఎలిజిబుల్ ఏజెంట్‌…

by Bunty
Ad

చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచుల‌ర్ సినిమాతో ఆ కోరిక తీరింది. వ‌ర‌స ప‌రాజ‌యాల త‌రువాత హిట్ అందుకోవ‌డంతో ఖుషీ ఆయ్యాడు ఈ బ్యాచుల‌ర్‌. ఆదే ఊపుతో సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో అఖిల్ ఫ్రెష్ అండ్ న్యూలుక్‌తో ద‌ర్శ‌నం ఇవ్వ‌బోతున్నారు. సినిమా షూటింగ్‌కు ముందే జిమ్‌లో గంట‌ల త‌ర‌బ‌డి వ‌ర్కౌట్స్ చేసి అమేజింగ్ బాడీ షేప్‌తో వావ్ అనిపించాడు. తాజాగా అఖిల్ జిమ్ బాడీకి సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేశాడు. ఈ ఫొటో అక్కినేని అభిమానుల‌తో పాటు, స‌గటు టాలీవుడ్ ప్రేక్ష‌కుడిని కూడా ఆక‌ట్టుకుంటోంది. ఏకే ఎంట‌ర్టైన్మెంట్ ప‌తాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. మెగాస్టార్‌తో సైరా త‌రువాత సురేంద‌ర్ రెడ్డి చేస్తున్న సినిమా ఇదే కావ‌డంతో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచుల‌ర్ చిత్రంలో ల‌వ‌బుల్ బాయ్‌గా అఖిల్ అద‌ర‌గొట్టాడు. ఏజెంట్ సినిమాలో త‌న మార్క్ స్టైలిష్ న‌ట‌న‌తో మాస్ ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటాడ‌ని అక్కినేని అభిమానులు చెబుతున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ రెండు షెడ్యూల్స్‌ను పూర్తిచేసుకొని మూడో షెడ్యూల్‌కు రెడీ అవుతున్న‌ది. ఈ చిత్రంలో మ‌ళ‌యాలం సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. సాక్షి వైద్య క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. మ‌రి ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే…

Advertisement

Visitors Are Also Reading