Home » అఖండ ఓటీటీ విడుదలకు ముహూర్తం ఫిక్స్…ఎప్పుడంటే…?

అఖండ ఓటీటీ విడుదలకు ముహూర్తం ఫిక్స్…ఎప్పుడంటే…?

by AJAY
Ad

నందమూరి హీరో బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా అఖండ. ఈ సినిమా డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో కొనసాగుతోంది. అంతేకాకుండా కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన బడా సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటిటి విడుదలకు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం అందుతోంది.

Advertisement

ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను డిస్నీ హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12 నుండి ఓటిటిలో ప్రసారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సినిమాను టీవీలో ఫిబ్రవరి 27న స్టార్ మా లో ప్రసారం చేసే అవకాశం ఉన్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

Also read :తెలంగాణ‌లో భారీగా పెర‌గిన సినిమా టికెట్ల ధ‌ర‌లు..వివ‌రాలు ఇవే..!

ఇప్పటికే బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ లాంటి చిత్రాలు సూపర్ హిట్ గా నిలవగా అఖండ తో వీరిద్దరి కాంబినేషన్ హాట్రిక్ ను నమోదు చేసింది. ఇదిలా ఉంటే బాలకృష్ణ తదుపరి సినిమాను కూడా మరో మాస్ డైరెక్టర్ తో ఫిక్స్ చేసుకున్నారు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని తో బాలయ్య తదుపరి సినిమా ఫిక్స్ అయ్యింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.

Visitors Are Also Reading