ప్రస్తుతం సినిమాలు విడుదలయ్యిందంటే నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దానికి కారణం ఓటీటీలు కూడా నిర్మాతలకు భారీగా ముట్టజెప్పుకోవడమే. సినిమా సూపర్ హిట్ గా నిలిచినా ఫ్లాప్ అయ్యినా వీలైనంత త్వరగా ఓటీటీలోకి వదులుతున్నారు. మరోవైపు ఓటీటీకి కూడా ప్రేక్షకాదరణ పెరగటంతో సినిమా కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే రీసెంట్ గా విడుదలైన బాలయ్య అఖండ సినిమా కూడా త్వరలోనే ఓటీటీలోకి రాబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.
Advertisement
ఇక బాలయ్యకు విలన్ గా ఈ సినిమాలో శ్రీకాంత్ నటించి ఆకట్టుకున్నాడు. బాలయ్య రెండు పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటూ అఖండ సినిమాకు ఓవర్సీస్ లోనూ భారీగా కలెక్షన్ లు వస్తున్నాయి. కాగా ఇప్పుడు అఖండ సినిమా కూడా త్వరలోనే ఓటీటీలో ప్రసారం కానుందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.ఈ చిత్రాన్ని ఓటీటీ ప్రేక్షకుల కోసం త్వరలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా హాట్ స్టార్ లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది.
Advertisement
also read : నా కలలన్నీ చెదిరిపోయాయి.. వచ్చే ఏడాది పై ఆశల్లేవు…సమంత ఎమోషనల్…!
దీని కోసం హాట్ స్టార్ కూడా చిత్ర యూనిట్ తో భారీ డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాను న్యూయర్ సంధర్బంగా ఓటీటీలో విడుదల చేసి అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే థర్డ్ వేవ్ వచ్చే సూచనలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి థర్డ్ వేవ్ వస్తే నష్టపోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఓటీటీకి వస్తున్నట్టు కూడా గుసగసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.