Home » క‌ర్నూల్ వేధిక‌గా అఖండ 100 రోజుల సెల‌బ్రేష‌న్స్…!

క‌ర్నూల్ వేధిక‌గా అఖండ 100 రోజుల సెల‌బ్రేష‌న్స్…!

by AJAY
Ad

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన సినిమా అఖండ‌. ఈ సినిమాలో ప్ర‌గ్యాజైష్వాల్ హీరోయిన్ గా న‌టించింది. మాస్ డైరెక్ట‌ర్ బోయాటి శ్రీను ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హించారు. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు మార్నింగ్ షోతోనే హిట్ టాక్ వ‌చ్చింది. విదేశాల్లోనూ ఈ సినిమా జోరు క‌నిపించింది. జ‌న‌వరి 20 నాటికి 103 థియేట‌ర్ ల‌లో ఈ సినిమా 50 రోజులు పూర్తిచేసింది. ఇటీవ‌ల కాలంలో 50 రోజులు పూర్తిచేసుకున్న సినిమాలు క‌నిపించ‌డంలేదు.

Advertisement

Advertisement

కానీ అఖండ 50రోజులు పూర్తి చేసుకుని రేపుటితో వంద‌రోజులు పూర్తి చేసుకుంటుంది. ఇక సినిమాను అంత‌లా ఆద‌రించిన ప్రేక్ష‌కుల‌కు చిత్ర‌యూనిట్ కృత‌జ్క్ష‌త‌లు చెప్పేందుకు క‌ర్నూలులో ఎస్టీబీసీ గ్రౌండ్స్ లో కృత‌జ్ఞ‌త స‌భ‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 12న ఈ కార్య‌క్ర‌మం మొద‌ల‌వుతోంది. ఇదిలా ఉండ‌గా కొంత‌కాలంగా టాలీవుడ్ లో క‌లెక్ష‌న్స్ గురించి చెబుతున్నారు కానీ వంద‌రోజుల ఫంక్ష‌న్ లు క‌నిపించ‌డంలేదు. కానీ అఖండ సినిమా మ‌ళ్లీ వంద రోజుల ఫంక్ష‌న్ తో ముందుకు రావ‌డం అభిమానుల‌ను కుషీ చేస్తోంది.

Visitors Are Also Reading