Home » ఓటీటీలో బ‌న్నీ కోసం రెండు వారాలు వెన‌క్కి త‌గ్గిన బాల‌య్య

ఓటీటీలో బ‌న్నీ కోసం రెండు వారాలు వెన‌క్కి త‌గ్గిన బాల‌య్య

by Anji
Ad

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అఖండ డిసెంబ‌ర్ 02 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విడుద‌లైన రోజు భారీ క‌లెక్ష‌న్‌లు వ‌సూలు చేసింది. ఇంకా తెలుగు రాష్ట్రాల‌లో కొన్ని కేంద్రాల్లో సాలిడ్ వ‌సూళ్లు రాబ‌డుతుంది. స‌రైన సినిమా ప‌డితే బాల‌య్య వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం ఏవిధంగా ఉంటుందో అఖండ నిరూపించింది.

balakrishna akhanda grabs solid ott offer from disney plus hot star

Advertisement

ఒక సాలిడ్ క‌మ‌ర్షియ‌ల్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుండ‌గా అఖండ‌తో బాల‌య్య దాహం తీరింది. నంద‌మూరి అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ బోయ‌పాటితో సాధ్య‌మైంది. వ‌రుస ప్లాప్‌ల‌తో బాల‌య్య మార్కెట్ కేవ‌లం రూ.10కోట్ల‌కు ప‌డిపోయింది. ఈ నేప‌థ్యంలో అఖండ వంద కోట్ల వ‌సూలు చేసి రికార్డు సృష్టించింది.

Advertisement

Akhanda review: Nandamuri Balakrishna film is an assault on the senses |  Entertainment News,The Indian Express

తొలుత జ‌న‌వ‌రి 14న ఓటీటీలో విడుద‌ల‌తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇప్పుడు అఖండ విడుద‌లపై క్లారిటీ ఇచ్చింది. జ‌న‌వ‌రి 21 నుంచి అఖండ స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ వెల్ల‌డించింది. అల్లుఅర్జున్ పుష్ప కంటే రెండు వారాల ముందే అఖండ థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. కానీ ఓటీటీలో మాత్రం పుష్ప వ‌చ్చిన త‌రువాత అఖండ వ‌స్తుంది. జ‌న‌వ‌రి 07న హిందీలో త‌ప్ప తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ వంటి భాషల్లో విడుద‌ల‌వ్వ‌నుంది. పుష్ప‌కోస‌మే రెండు వారాలు వెన‌క్కి త‌గ్గింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ నేప‌థ్యంలో అఖండ ఓటీటీ కోసం కొద్ది రోజులు ఆగాల్సిందేనా అంటున్నారు బాల‌య్య అభిమానులు. ఇక‌పోతే అఖండ చిత్రం విడుద‌లై నెల రోజులు దాటినా చాలా చోట్ల పుల్ క‌లెక్ష‌న్ల‌తో కుమ్మేస్తుంది.

Visitors Are Also Reading