Home » బాలయ్య అభిమానులా మజాకా… అఖండ 175 రోజులు పూర్తి..!

బాలయ్య అభిమానులా మజాకా… అఖండ 175 రోజులు పూర్తి..!

by Azhar
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన వసరం లేదు. ఆయన సినిమా వస్తుంది అంటేనే ఈ సినిమాలో బాలయ్య ఎలా ఫైట్స్ చేయబోతున్నాడు అనే చూస్తారు. ఇక బాలయ్య దర్శకుడు బోయపాటి కాంబినేషన్ అంటే ఆ అంచనాలు మరో రేంజ్ కు వెళ్తాయి. అందుకు కారణం వారి కాంబినేషన్ లో వచ్చిన గత సినిమాలు. ఇక ఇప్పుడు తాజాగా మళ్ళీ వీరి కాంబినేషన్ తో వచ్చిన మూడో సినిమా అఖండ.

Advertisement

గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన అభిమానులా ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయన్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా మరో రికార్డును క్రియేట్ చేసింది. అదేంటంటే ఈ సినిమా థియేటర్లో 175 రోజులు పూర్తి చేసింది. అయితే ఒక్కపుడు అంటే ఓ సినిమా 100, 200, 300 రోజులు ఆడటం మాములు విషయం. కానీ ఇప్పుడు 50 రోజులు ఆడటమే పెద్ద విషయం. అలాంటిది ఇప్పుడు అఖండ సినిమా ఏకంగా 175 రోజులు ఆడింది. అయితే ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో వచ్చింది. అలాగే టీవీలో కూడా ప్రసారమైంది.

Advertisement

కానీ బాలయ్య అభిమానులు, మేకర్స్ కలిసి ఈ సినిమను ఒక్క థియేటర్లో 175 రోజులు ఆడించారు. దాంతో మరి ఇంత పిచ్చి ఏంటి అంటున్నారు ప్రజలు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజియఫ్ వాటి పాన్ ఇండియా సినిమాలు విడుదలయ్యాయి. వాటి మధ్యలో ఈ సినిమాను నడిపించడం అంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పనో కొత్తగా చెప్పల్సిన అవసరం లేదు. అయితే గతంలో కూడా బాలయ్య సినిమాలకు ఇలా జరిగింది. అప్పట్లో బాలయ్య సినిమాలో ఏడాది పొడువునా కూడా ఆడాయి.

ఇవి కూడా చదవండి :

ఆర్ఆర్ ఫ్లైట్ లో పొగమంచు.. ల్యాండ్ చేయాలంటూ ఆటగాళ్ల కేకలు..!

భారత టీ20 కెప్టెన్ గా రాహుల్.. టెస్ట్ కెప్టెన్ గా రోహిత్..!

Visitors Are Also Reading