Telugu News » Blog » దర్శకుడు పూరిజగన్నాథ్ ఆస్తులు పోవడానికి అసలు కారణం వెల్లడించిన ఆకాశ్ పూరి

దర్శకుడు పూరిజగన్నాథ్ ఆస్తులు పోవడానికి అసలు కారణం వెల్లడించిన ఆకాశ్ పూరి

by Anji
Ads

దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో కాస్త డిసప్పాయింట్ గా ఉన్నారు.  ఇదిలా ఉంటే..  సోషల్ మీడియాలో పూరి జగన్నాథ్ ఆస్తులకి సంబంధించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

గతంలో పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘ టాలీవుడ్ కి చెందిన ఇద్దరూ హీరోలను టాప్ పొజిషన్ లో ఉండడానికి దర్శకుడు పూరి జగన్నాథ్ కారణమని తెలిపారు. “ నేను చిన్నప్పుడే డాడీకి చెప్పాను నీకు సినిమా మీద ఎంత పిచ్చి ఉందో.. నీ కంటే నాకు కూడా అంతే పిచ్చి ఉందన్నారు. మా నాన్న పెద్ద డైరెక్టర్ అని మేము చాలా హ్యాపీగా ఉన్నాం. చిరుత సినిమాతో  చైల్డ్ యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చాను. చిన్నప్పుడు నాన్న గురించి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతోంది’ అని చెప్పుకొచ్చారు. 

Akash Puri

Advertisement

ఒక సమయంలో పూరి జగన్నాథ్ డౌన్ అయిపోయారు. తరువాత పూరి అంటే ఏంటో నిరూపించుకున్నారు. పూరిజగన్నాథ్ విడాకులు తీసుకున్నారు అని మాట ఎంత వరకు వాస్తవం అని యాంకర్ ఆకాశ్ పూరిని ప్రశ్నించారు. దీంతో ఆకాశ్ పూరి స్పందించారు. అన్ని కష్టాల్లో కూడా అమ్మ సపోర్ట్ తోనే నాన్న తిరిగి నిలదొక్కుకున్నారు. వాళ్లిద్దరిదీ ప్రేమ వివాహం. పెళ్లికి ముందే సిని ఇండస్ట్రీలో ఉన్న కష్ట, నష్టాల గురించి వివరించారట. ఇప్పుడు నా దగ్గర కేవలం రూ.200లు మాత్రమే ఉన్నాయి. రేపు ఎలా ఉంటుందో కూడా చెప్పలేను కానీ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడట. 

Also Read :  వారసుడు వివాదానికి కారణం ఎవరో చెప్పేసిన దిల్ రాజు..!

 

దీంతో అమ్మ పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ఇంతలా ప్రేమిస్తుందా అనిపించింది. అంతలా ప్రేమించిన అమ్మ ఎందుకు విడాకులు తీసుకుంటుందని సమాధానం చెప్పారు. మా నాన్న మా అమ్మని నమ్మడం చాలా గ్రేట్ అనిపించింది. నాన్న డైలాగ్ లు రాయడం అమ్మకి చాాలా ఇష్టం. ప్యామిలీ మొత్తాన్ని మమ్మీ హ్యాండిల్ చేస్తుంది. డాడీ షూటింగ్ లు చేసుకొని ఏ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉంటాడు. మమ్మీ ఉంటే డాడీ రిలాక్స్ అవుతాడు. ముఖ్యంగా అమ్మానాన్న ప్రేమ విషయం తెలిసి నేను కూడా ఆశ్చర్యపోయాను. మా అమ్మానాన్న, మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం. కొంత మందికి ఏం చేయాలో తెలియక ఇలాంటి రూమర్స్ పుట్టిస్తున్నారు. వాటిని అస్సలు నమ్మకండి అని ఆకాశ్ వివరించారు. 

Advertisement

Also Read :  పునీత్ రాజకుమార్ సహా చిన్న‌వ‌య‌సులోనే క‌న్న‌ముసిన క‌న్న‌డ స్టార్ హీరోలు..! అదే శాపంగా మారిందా..?