Home » వాలిమై సినిమా టైటిల్ వివాదం.. దాని అర్థం ఏమిటో తెలుసా..?

వాలిమై సినిమా టైటిల్ వివాదం.. దాని అర్థం ఏమిటో తెలుసా..?

by Anji
Ad

త‌మిళ సూప‌ర్ స్టార్ అజిత్‌కుమార్ హీరోగా హెచ్‌. వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో బోనిక‌పూర్ నిర్మించిన వలిమై సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. అయితే దీపావ‌ళికే ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని భావించినా క‌రోనా కేసులు ఇత‌ర విష‌యాల కార‌ణంగా వాలిమై వాయిదా ప‌డింది.

 

BREAKING: Ajith Kumar's much awaited action thriller Valimai postponed; Tamil Nadu cinemas to shut

Advertisement

ఈ సినిమాలో తెలుగు హీరో కార్తీకేయ అజిత్‌తో ఢీ కొట్ట‌బోతున్నాడు. ఆర్‌.ఎక్స్‌. 100 సినిమాతో సూప‌ర్ హిట్ ద‌క్కించుకొని తెలుగులో మంచి సినిమాలు చేస్తున్న గుమ్మ‌కొండ కార్తీకేయ ఇప్పుడు త‌మిళంలో విల‌న్‌గా న‌టించ‌డం వ‌ల్ల అంచ‌నాలు భారీగా పెరిగాయి. వాలిమై గురించి తెలుగువారు ఎక్కువ‌గా మాట్లాడుకుంటున్న కార‌ణంగా సినిమాను తెలుగులో కూడా విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. ఈ మ‌ధ్య‌కాలంలో అజిత్ సినిమాల‌ను తెలుగులో విడుద‌ల చేయ‌లేదు.

 

సూపర్ స్టార్‌ సినిమా టైటిల్ వివాదం.. అర్థం తెలియని ఎలా చూస్తాం భయ్యా

Advertisement

 

తెలుగు ప్రేక్ష‌కులు ఆయ‌న సినిమాను ఆధ‌రించ‌డం లేదు. కానీ ఈసారి కార్తీకేయ న‌టించ‌డం మూలంగా వాలిమై తెలుగులో విడుద‌ల చేయాల‌ని భావించారు. వాలిమై తెలుగులో బ‌లం అనే టైటిల్‌తో విడుద‌ల చేయాల‌ని భావించారు. అందుకోసం పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేసారు. అయితే టైటిల్ దొర‌క‌లేదో లేదంటే బ‌లం టైటిట్ రీచ్ అవ్వ‌డం లేద‌నుకున్నారో కానీ మ‌ళ్లీ వాలిమై టైటిల్‌తోనే తెలుగులో కూడా విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించింది చిత్ర‌ యూనిట్‌.

 

సూపర్ స్టార్‌ సినిమా టైటిల్ వివాదం.. అర్థం తెలియని ఎలా చూస్తాం భయ్యా

వాలిమై తెలుగు పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసారు. వాలిమై అంటే అర్థం ఏమిటో తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలియ‌దు. అది ఏమిటో అనే విష‌యాన్ని పోస్ట‌ర్‌లో అయినా వేయాలి. వాలిమై కు అర్థం బ‌లం. క‌నుక వాలిమై టైటిల్ కింద బ‌లం అంటూ స‌బ్ టైటిల్ మాదిరిగా వేస్తే అర్థం అవుతుంది. కానీ వాలిమై చూడండి అంటే అస‌లు టైటిల్ అర్థం తెలియ‌కుండా ఎలా చూస్తాం రా బాబు అంటూ కొంద‌రూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

Visitors Are Also Reading