Telugu News » Blog » మ్యాచ్ ఫిక్సింగ్‌తో ఆ స్టార్ హీరోయిన్ దూరం.. అజ‌య్ జ‌డేజా బ్రేక‌ప్ స్టోరీ మీకు తెలుసా..?

మ్యాచ్ ఫిక్సింగ్‌తో ఆ స్టార్ హీరోయిన్ దూరం.. అజ‌య్ జ‌డేజా బ్రేక‌ప్ స్టోరీ మీకు తెలుసా..?

by Anji
Ads

అజ‌య్ జ‌డేజా పేరు తెలియ‌ని క్రికెట్ అభిమానులుండ‌రు. మాధురీ దీక్షిత్‌ను గుర్తు ప‌ట్ట‌ని సినీ ప్రేక్ష‌కులుండ‌రు. వీరిద్ద‌రూ ఓ వెలుగు వెలిగారు. వారి రంగాల్లోని వారు పాపులారిటీ సంపాదించుకుని ఒక‌రితో ఒక‌రు ప్రేమ‌లో ప‌డేలా చేసింది. పెళ్లి దాకా మాత్రం వెళ్ల‌లేదు. అర్ధాంత‌రంగానే ముగిసింది వీరి ల‌వ్‌స్టోరి. వీరి ప్రేమ క‌థ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1990లో జ‌రిగిన క‌థ‌. ఓ మ్యాగ‌జైన్ కోసం షూట్ చేయ‌డానికి అక్క‌డికి అజ‌య్ వెళ్లాడు. అక్క‌డ అత‌నికి మాదురి దీక్షిత్ క‌లిసింది. అప్ప‌టి వ‌ర‌కు ఆమె సినిమాలను చూసేవాడు. ఆ వెండితెర వేలుపు త‌న క‌ళ్ల ముందే క‌నిపించే స‌రికి ఆశ్చ‌ర్య‌పోయాడు. ఆమె అందానికి ముగ్దుడ‌య్యాడు. అజ‌య్ జ‌డేజా గురించి మాదురి దీక్షిత్ విన్న‌ది కానీ చూడ‌డం మొద‌టి సారి అదే. ఆ ప‌రిచ‌యానికి కాస్త ఎగ్జ‌యిట్ అయింది. అప్పుడే వారిద్ద‌రి మ‌ధ్య స్నేహం చిగురించింది.

Also Read : మ‌ధ్య‌లోనే ఆగిపోయిన రాజ‌మౌళి సినిమా ఏదో తెలుసా…హీరో ఎవ‌రంటే..!

అప్ప‌టికే మాదురి సంజ‌య్ ద‌త్ తో ప్రేమ‌, అత‌ను టాడా కేసులో ఇరుక్కోవ‌డంతో మాధురిని మీడియా ఫోక‌స్ చేసింది. ఇలాంటి చికాకులో ఉన్న మాధురి క‌ల‌త‌, క‌ల‌వ‌రం గూడులోనే దాక్కుంది. ఆ స‌మ‌యంలోనే అజ‌య్ ప‌రిచ‌యం స్నేహం ఆమెకు కాస్త ఊర‌ట‌నిచ్చాయి. అత‌ని హాస్య చ‌తుర‌త ఆమెకు ఉత్సాహాన్ని, ఆస‌క్తిని పెంచింది. ఆమెకు తెలియ‌కుండా అత‌నితో ప్రేమ‌లో ప‌డిపోయింది. మాధురికీ త‌న మీద ఉన్న ప్రేమ‌ను సినిమా రంగంలో త‌న ఎంట్రీకి పాస్‌గా అజ‌య్ వినియోగించుకోవాల‌నుకున్నాడు.

మాధురికి ప‌రిచ‌యం ఉన్న నిర్మాత‌లంద‌రినీ అజ‌య్‌కు ప‌రిచ‌యం చేసింది. వాళ్ల‌కు అత‌న్ని రిక‌మెండ్ చేసింది. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న ఆ చ‌నువు చూసి బాలీవుడ్‌లో గుస‌గుస‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఆ టైమ్‌లోనే ఈ జంట ఓ మ్యాగ‌జైన్ మీద క‌వ‌ర్ ఫోటోగా ప్రింట్‌ అయింది. వీరు పెళ్లి చేసుకుంటార‌నే గుస‌గుస‌లు వినిపించాయి. ఈ స‌మ‌యంలో క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ సంచ‌ల‌న‌మైంది. అందులో అజ‌య్ పేరు వినిపించింది. ఇవేమి ప‌ట్టించుకోని మాధురి అజ‌య్ వాళ్ల త‌ల్లిదండ్రుల‌కు వారి ప్రేమ విష‌యం చెప్పింది. కానీ అజ‌య్ వాళ్ల‌ది రాజ‌కుటుంబం కావ‌డంతో ఈ ఇంటి కోడ‌లు ఓ సినిమా న‌టినా..? అలా వీలు లేద‌ని పేర్కొన్న‌ట్టు స‌మాచారం.


ఇదిలా ఉంచితే మ్యాచ్ ఫిక్సింగ్‌లో అజ‌య్ దోషిగా తేలాడు. మాధురి ఇన్ని గంద‌ర‌గోళాల మ‌ధ్య ఆ రిలేష‌న్‌ను ముందుకు తీసుకెళ్లాల‌నుకోలేదు. అంత‌కు ముందు ఆమె కుటుంబం అజ‌య్ ప‌ట్ల సానుకూల దృక్ప‌థంతో ఉంది. ఎప్పుడైతే మ్యాచ్ ఫిక్సింగ్‌లు.. మాధురీ ప‌ట్ల అత‌ని ఇంట్లో వాళ్ల‌కు ఉన్న అభిప్రాయం తెలిసే స‌రికి ఆమె ఇంటి వాళ్లు ఆ సంబంధం వ‌ద్ద‌నుకున్నారు. ఆ ప్రేమ‌కు చ‌ర‌మ‌గీతం పాడి మ‌న‌స్సులోంచి అజ‌య్‌ను చెరిపేసుకొమ్మ‌నే స‌ల‌హా ఇచ్చారు. అయినా అజ‌య్ జ‌డేజా నుండి సానుకూల స్పందన వ‌స్తుందేమో అని ఆమె ఎదురు చూసింది. అజ‌య్ నుంచి ఎలాంటి వివ‌ర‌ణ రాక‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు అమెరికా సంబంధం తీసుకొచ్చారు. ఇక ఎలాంటి త‌ర్జ‌న‌భ‌ర్జ‌న లేకుండా డాక్ట‌ర్ శ్రీ‌రామ్‌ను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లింది. ఇక అజ‌య్ కూడా జ‌య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

Also Read :  ‘మగధీర’ లో ‘బంగారు కోడి పెట్ట’ పాటచూసి ఎస్పీ బాలు అలా అన్నారట..!


You may also like