Telugu News » ఉత్కంఠ భరితంగా ‘రుద్ర’ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌

ఉత్కంఠ భరితంగా ‘రుద్ర’ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌

by Anji

ప్ర‌స్తుతం ఓటీటీ మార్కెట్ ఓ రేంజ్‌లో విస్త‌రిస్తోంది. ఓటీటీ వేదిక‌గా సినిమాల‌ను త‌ల‌ద‌న్నే కంటెంట్తో మేక‌ర్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. ఇలా వస్తోన్న వెబ్‌ సిరీస్‌లలో రుద్ర ఒకటి. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌లో రాశీ ఖన్నా కూడా నటిస్తోన్న విషయం తెలిసిన‌దే. లూథర్‌ అనే పాపులర్‌ బ్రిటీష్‌ వెబ్‌ సిరీస్‌ ఆధారంగా ఈ వెబ్‌సిరీస్‌ తెరకెక్కిస్తున్నారు. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ వేదికగా మార్చి 4న టెలికాస్ట్‌ కానున్నది. అయితే ఈ వెబ్‌ సిరీస్‌పై అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర యూనిట్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. రెండు నిమిషాల నిడివి ఉన్న ‘రుద్ర’ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా ఉంది.

Ads

ఈ వెబ్‌ సిరీస్‌లో అజయ్‌ దేవగణ్‌ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. మనుషులను అత్యంత క్రూరంగా చంపుతూ పైశాశిక ఆనందం పొందుతోన్న ఓ సీరియల్‌ కిల్లర్‌ను పట్టుకునే బాధ్యతను తీసుకున్న అజయ్‌ దేవగణ్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో రుద్ర ఏం కోల్పోయాడు. చివరికి కిల్లర్‌ను అరెస్ట్‌ చేశాడా అన్న కథాంశంతో ఈ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించారు. చీకట్లో దాక్కున్న వాళ్లను నేను అక్కడికి వెళ్లే పట్టుకుంటానని అజయ్‌ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది.

రాశీ ఖన్నా తొలిసారిగా నటిస్తోన్న ఈ వెబ్‌ సిరీస్‌లో విభిన్న పాత్రలో కనిపిస్తోంది. రాశీ ఇప్పటి వరకు కనిపించని పాత్రలో ఆకట్టుకుంది. అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, బీబీసీ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ హిందీతో పాటు తెలుగు, కన్నడ, మరాఠీ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదల చేయనున్నారు.

https://youtu.be/FyuODiTjoFs


You may also like