మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ అంటే తెలియని వారు ఉండరు. ఆమె తన అందంతోనే కాదు నటనతో కూడా ఇండియా మొత్తం అభిమానులను సంపాదించుకుంది. మోడలింగ్ ద్వారా కెరియర్ ప్రారంభించి మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచి సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. తన 30 ఏళ్ల సినీ కెరియర్లో ఎన్నో సినిమాల్లో నటించింది. నటనతో పాటు ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే కోట్లాది రూపాయల ఆస్తులు కూడా సంపాదించుకుందట. మరి ఐశ్వర్యారాయ్ ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటుంది.. ఆమె లగ్జరీ లైఫ్ ఆస్తుల విలువ చూద్దాం..
also read:Malli Pelli : నరేష్, పవిత్రల ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్ విడుదల… రమ్యకు దించి పడేశాడుగా!
Advertisement
also read:NTR30 లో జాన్వికి తల్లిగా చేసేది ఎవరో తెలుసా..?
Advertisement
ఐశ్వర్య రాయ్ ఇప్పటివరకు సంపాదించిన ఆస్తులు విలువ 1000 కోట్లకు పైగానే ఉంటుందట. ఆమె సినిమాల ద్వారా కాకుండా అడ్వర్టైజ్మెంట్స్, ఇతర బ్రాండ్స్ వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ కోట్లాది రూపాయల పారితోషకం తీసుకుంటూ వేల కోట్ల ఆస్తులు సంపాదించిందట. ఆమెకు రెండు విల్లాలు, కోట్ల విలువ చేసే బిల్డింగులు, స్థలాలు, లగ్జరీ కార్లు ఉన్నాయట.
ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకి 10 కోట్ల నుంచి 12 కోట్ల పారితోషకం అందుకుంటుందట. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ రోలేస్ రైస్ కోస్ట్ అనే కారుని వాడుతుందట. దీని ఖరీదు ఎనిమిది కోట్ల కు పైగానే ఉంటుందట. ఇక అలాగే ఆమె గ్యారేజ్‌లో ఆడి ఇంకా కోట్లాది విలువ చేసే కార్లు ఉన్నాయట. అయితే ఈమె సంపాదించిన ఆస్తిపాస్తులు కాకుండా భర్త ద్వారా కూడా ఆమెకు వేలకోట్ల ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. ఇక తన కూతురు ఆరాధ్య పేరుపై ఇప్పుడే వందలాది కోట్ల ఆస్తులు కలిగి ఉందట.
also read:Balagam venu: బాలయ్యతో సినిమా చాన్స్ కొట్టేసిన బలగం వేణు..!!