ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకప్పుడు ఈమెకు ఉన్న క్రేజ్ ఏ హీరోయిన్ కు కూడా లేదు. కానీ ఈమె విషయంలో టాలీవుడ్ లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ప్రధానంగా సౌత్ సినిమాల్లో చాలానే నటించింది. కానీ తెలుగులో మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించకపోవడం గమనార్హం. 1999లో రావోయి చందమామ సినిమాలో ఒక పాటలో మెరిసింది. హీరోయిన్ గా ఫుల్ లెన్త్ రోల్ ఆమె చేయలేదు. ఐశ్వర్య ఒక్క తెలుగు సినిమాలో పుల్ లెన్త్ రోల్ చేయకపోవడం బాధాకరమనే చెప్పుకోవాలి.
Advertisement
వాస్తవానికి తెలుగులో ఆమెకు అవకాశాలు చాలానే వచ్చాయి. జయంతు సి పరాన్జీ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం.. రా సినిమాలో హీరోయిన్ గా తొలుత ఐశ్వర్యరాయ్ నే వరించింది. జయంత్ ఫ్యామిలీ ఫ్రెండ్ కి ఐశ్వర్యరాయ్ తో పరిచయం ఉంది. అందుకే ఆ దర్శకుడు ఆమెనే హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుందని అనుకున్నాడు. ఇదే విషయాన్ని నిర్మాత తో పాటు చిత్ర యూనిట్ కి తెలియజేశారు. అయితే ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. దానికి ఒక కారణం ఉంది అది ఏంటంటే.. అదే సమయంలో ఐశ్వర్య నటించిన ‘ఇరువురు’ మూవీ ఫ్లాప్ కావడమే. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫెయిల్ అయిందని అలాంటి ఫ్లాప్ హీరోయిన్ తో సినిమా తీస్తే ప్రేమించుకుందాం.. రా సినిమా కూడా ప్లాప్ అవుతుందనే బ్యాడ్ సెంటిమెంటును వారు నమ్మారు. అలా ఐశ్వర్యరాయ్ ఈ అవకాశాన్ని కోల్పోయింది.
Advertisement
చివరికి ప్రేమించుకుందాం..రా సినిమాలో అంజలా ఝావేరికి దక్కింది. ఈ సినిమాతో అంజన సూపర్ హిట్ అందుకుంది. అయితే ఐశ్వర్యరాయ్ తో పోలిస్తే ఆమె యావరేజ్ బ్యూటీ అని చెప్పుకోవాలి.. ఐశ్వర్య కి ఈ సినిమా ఛాన్స్ కోల్పోయిన పెద్దగా నష్టం జరగలేదు. ఇరువురు సినిమా తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అవతరించింది. బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకునే అంత రేంజ్ టాలీవుడ్ దర్శక నిర్మాతలకు లేకుండా పోయింది. ప్రస్తుతం ఐశ్వర్య డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది ఐశ్వర్యరాయ్. కానీ నేరుగా తెలుగు సినిమాలో మాత్రం నటించలేకపోయింది.