Telugu News » Blog » పాతాళ‌గంగ పైకి.. నిండుకుండలా వ్య‌వ‌సాయ బావి

పాతాళ‌గంగ పైకి.. నిండుకుండలా వ్య‌వ‌సాయ బావి

by Anji
Ads

రోజు రోజుకు కాలుష్యం పెరుగుతున్న త‌రుణంలో భూగ‌ర్భ జ‌లాలు అడుగంటి పోతుండ‌టం మ‌నం నిత్యం చూస్తూనే ఉన్నాం. కానీ తాజాగా తెలంగాణ‌లో ఒక చోట ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా బావిలోకి నీరు ఒకేసారి వ‌చ్చి చేరింది. దీంతో బావికి సంబంధించిన వ్య‌క్తి ఆశ్య‌ర్యానికి గుర‌య్యారు.

Ads

Thumbnail image

తెలంగాణ‌లోని మ‌హ‌బాబాబాద్ జిల్లా దంతాల ప‌ల్లి మండ‌లం కుమ్మ‌రికుంట శివారులో ఉన్న‌టువంటి ఓ వ్య‌వ‌సాయ బావి నిండు కుండులా మారిన‌ది. భూగ‌ర్భ జ‌లాలు బావి ఉప‌రితలం వ‌ర‌కు ఉబికి వ‌చ్చాయి. మోటారు లేకుండా గ‌ల‌గ‌ల ఆ గంగ‌మ్మ‌పార‌డం చూసి ఆ అన్న‌దాన ఆంనందానికి అవుధులు లేకుండా పోయాయి.

Ads

పైకి ఉబికి వ‌స్తున్న ఈజ‌ల‌దృశ్యాన్ని స్థానికులు, చెరువు క‌ట్ట‌పై నుంచి వెళ్లే ప్ర‌యాణికులు, వాహ‌న‌దారులు ఎంతో ఆస‌క్తిగా తిల‌కిస్తున్నారు. చుట్టూ అప్పుడే నాటిన వ‌రి నాట్లు.. మ‌ధ్య‌లో బావి, ఈ విజువ‌ల్స్ అంద‌రినీ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. అందుకే అటు వెళ్లే వారంద‌రూ సెల్ ఫోన్‌ల‌లో ఆ దృశ్యాల‌ను బంధించుకుంటున్నారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ జ‌ల‌దృశ్యాలు వైర‌ల్ అవుతున్నాయి.