Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » అఘోరాలను సినిమాకు రప్పించిన బాలయ్య ….!

అఘోరాలను సినిమాకు రప్పించిన బాలయ్య ….!

by AJAY
Published: Last Updated on
Ads

ప్రస్తుతం ఎక్కడ చూసినా అఖండ సినిమా జోరు వినిపిస్తోంది. సాధారణంగానే బాలయ్య సినిమా అంటే చెప్పలేనంత క్రేజ్ ఉంటుంది. ఇక బోయపాటి బాలయ్య సినిమా అంటే మాటల్లో చెప్పలేం. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా అఖండ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో నటించగా…. బాలయ్యను ఘోర పాత్రలో చూసేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపించారు.

Advertisement

Aghora came to balayya akhanda movie

Aghora came to balayya akhanda movie

టీజర్, ట్రైలర్ లలో బాలయ్య అగోరా పాత్రలో చేసిన ఫైట్ లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక సినిమా చూసిన తరవాత కూడా బాలయ్య అఘోరా పాత్రలో రెచ్చిపోయారు అని రివ్యూలు వస్తున్నాయి. చాలా కష్టమైన పాత్రలో బాలయ్య జీవించారని చెబుతున్నారు. ఇక సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రముఖులు సైతం అఖండ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Ad

Advertisement

 

ఇదిలా ఉంటే బాలయ్య తన సినిమా తో ఎక్కడో శివనామస్మరణ చేసుకునే అఘోరాలు సైతం అఖండ సినిమాకు వచ్చారు. విశాఖ జిల్లా నర్సీపట్నం లోని సినిమా థియేటర్ కు అఘోరాలు వచ్చారు. శరీరానికి విభూది పూసుకుని..తాయిత్తులు కట్టుకుని వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్లు కూడా అభిమానులతో కలిసి సినిమా చూశారు. ఆ తర్వాత శివనామ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రస్తుతం వారి ఫోటో వైరల్ అవుతోంది. ఈ సినిమా తో అఘోరాలు కూడా బాలయ్యకు అభిమానులు అవుతారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Visitors Are Also Reading