Home » Ajit Agarkar: టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్

Ajit Agarkar: టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్

by Bunty
Ad

గత కొన్ని రోజులుగా టీమిండియా ఐసీసీ టోర్నమెంట్లు కొట్టడంలో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. మొన్న జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా చతికిల పడిన సంగతి తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్‌ జట్టుపై టీమిండియా ఏకంగా 209 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. దీంతో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, రాహుల్‌ ద్రావిడ్‌ లను తప్పించాలనే డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోయింది.

Advertisement

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్థానంలో ఓ యంగ్‌ ప్లేయర్‌ ను టీమిండియా కెప్టెన్‌ చేయాలనే డిమాండ్‌ పెరిగింది. అయితే.. ఇలాంటి తరుణంలోనే.. బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. టీమిండియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ అజిత్‌ అగార్కర్‌ ను టీమిండియా సెలక్టర్‌ గా నియామకం చేసింది బీసీసీఐ పాలక మండలి. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన కూడా చేసింది బీసీసీఐ.

Advertisement

సులక్షణ్‌ నాయక్‌, అశోక్‌ మల్హోత్రా, జతిన్‌ లతో కూడిన సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ గా టీమిండియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ అజిత్‌ అగార్కర్‌ ను నియామకం చేసింది బీసీసీఐ పాలక మండలి. ఈ మేరకు మంగళవారం రోజున అధికారిక ప్రకటన చేసింది బీసీసీఐ పాలక మండలి. ఇక వీరు రేపటి నుంచే బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, టీమిండియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ అజిత్‌ అగార్కర్‌ ను టీమిండియా సెలక్టర్‌ గా నియామకం కావడంపై.. క్రికెట్‌ ఫ్యాన్స్‌ అలాగే, విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి అనుభవం ఉన్న వ్యక్తిని సెలక్ట్‌ చేశారని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

Praveen Kumar : టీమిండియా బౌల‌ర్ ప్ర‌వీణ్ కుమార్ కారుకు ప్ర‌మాదం

టీమిండియా కెప్టెన్ గా రవిచంద్రన్ అశ్విన్ ?

2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..

Visitors Are Also Reading